ఆ సినిమాల సీక్వెళ్లు వస్తూనే ఉంటాయా? | Kollywood Continues Sequel Movies

Dhanush plan for vip 3

Dhanush, Dhanush VIP Franchise, Dhanush New Movie, Dhanush VIP 3, Dhanush Kollywood Sequels, Sequels in Kollywood 2017, Sequel Movies in Kollywood

Another Sequel for Hit Franchise. Actor Dhanush Announced VIP 2 Sequel starts soon. But Other Details not reveal.

కోలీవుడ్ లో మరో సీక్వెల్.. వీఐపీ-3 కి రెడీ

Posted: 08/17/2017 05:07 PM IST
Dhanush plan for vip 3

కొంత కాలం క్రితం బాలీవుడ్ కే పరిమితమైన సీక్వెళ్ల గోల ఇప్పుడు సౌత్ కి పాకిపోయింది. మరీ ముఖ్యంగా తమిళంలో సీక్వెళ్లతోనే కాలం గడిపేస్తున్నారు స్టార్ హీరోలు. సూర్య సింగం సిరీస్ తో మూడు సినిమాలు తీస్తే, కమల్ విశ్వరూపం రెండు పార్ట్ తో రాబోతున్నాడు. శతురంగ విట్టై 2 పేరుతో అరవింద స్వామి త్రిష జంటగా ఓ సినిమా, తిరుట్టుపయ్యాలె-2 అంటూ బాబీ సింహా, అమలాపాల్ ఇలా కోలీవుడ్ లో సీక్వెల్స్ దండయాత్ర కొనసాగుతోంది.

మరో యంగ్ హీరో ధనుష్ ఈ మధ్యే విఐపీ 2 తో అక్కడ కలెక్షన్లు కుమ్మేయగా, ఇప్పుడు దాని సీక్వెల్ కు కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు చెప్పేశాడు. వీఐపీ-2 సక్సెస్ మీట్ లో పాల్గొన్న ధనుష్ అఫీషియల్ గా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసేశాడు. ఈ సినిమా సక్సెస్ తనకి మరింత ఆనందాన్ని ఇచ్చిందనీ, ఈ ఉత్సాహంతో 'విఐపి 3'కి కూడా శ్రీకారం చుట్టే ఆలోచన ఉందని అన్నాడు. అయితే ఆ సినిమాకు దర్శకత్వం ఎవరు వహిస్తారన్న దానిపై మాత్రం ధనుష్ క్లారిటీ ఇవ్వలేదు.

సౌందర్య రజనీ కాంత్ డైరక్ట్ చేసిన వీఐపీ-2 కథ పరంగా ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే తక్కువ మార్కులే పడ్డప్పటికీ భారీ అంచనాల నడుమ విడుదలై కలెక్షన్లు కుమ్మేసింది. ఈ నెల 11న తమిళంలో విడుదలైన ఈ సినిమా, మొదటివారంలో 25 కోట్లను వసూలు చేసింది. ఇక రేపు హిందీ వర్షన్ విడుదల అవుతుండగా, వచ్చే వారం అంటే ఈ నెల 25న తెలుగులో వీఐపీ-2 గానే రిలీజ్ కాబోతుంది. ధనుష్ కిది స్ట్రెయిట్ తెలుగు మూవీ కావటంతో ఫలితం ఎలా ఉండబోతుందన్నది కీలకంగా మారనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kollywood  Sequel Movies  VIP 3  

Other Articles

Today on Telugu Wishesh