సర్పంచ్ లంతా ఆ సినిమా చూసి తీరాల్సిందే | Haryana Sarpanches Must Watch Toilet Movie

Haryana minister directs officials to show village heads toilet movie

Toilet Ek Prem Katha, Toilet Ek Prem Katha Haryana Government, Haryana Villages Bollywood Movie, Village Sarpanches Akki Movie, Toilet Ek Prem Katha Village Heads

Haryana minister orders Akshay-starrerToilet Ek Prem Katha to be shown in villages. Special screenings of 'Toilet Ek Prem Katha' for Haryana sarpanches and Villagers.

టాయ్ లెట్ చూడాలంటూ హర్యానా ప్రభుత్వం ఆర్డర్

Posted: 08/17/2017 04:40 PM IST
Haryana minister directs officials to show village heads toilet movie

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన తాజా చిత్రం టాయ్ లెట్ భాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు కలెక్షన్లనే రాబడుతోంది. వీక్ టాక్ తో మొదలైన చిత్రానికి పెద్దగా క్రౌడ్ రాలేకపోయినా కేవలం అక్కీ పేరు మూలంగానే ఆ మాత్రం అయినా కలెక్షన్లు రాగలిగాయి.

అయితే బ‌హిరంగ మ‌ల‌విస‌ర్జ‌న‌ను నిషేధించాల‌న్న కాన్సెప్ట్ మాత్రం జనాల్లోకి ఎక్కించేందుకు హర్యానా ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. `టాయ్‌లెట్‌` సినిమాను గ్రామాల్లో ప‌నిచేసే స‌ర్పంచ్‌, వీఆర్ఓల‌తో పాటు ప్ర‌తి ఒక్క గ్రామాధికారి త‌ప్ప‌కుండా వీక్షించాల‌ని హ‌ర్యానా ప్ర‌భుత్వం సూచించింది. ఈ మేర‌కు హ‌ర్యానా పంచాయ‌తీ రాజ్ శాఖ మంత్రి ఓపీ ధ‌న్‌ఖ‌ర్ మార్గ‌ద‌ర్శ‌కం చేశారు. వారి కోసం ప్ర‌త్యేకంగా జిల్లా కేంద్రాల్లో ప్ర‌త్యేక ప్ర‌ద‌ర్శ‌న‌లు ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ప్రభుత్వం తెలిపింది.

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ `స్వ‌చ్ఛ్ భార‌త్ అభియాన్‌` ఆశయానికి మ‌ద్ద‌తు తెలియ‌జేస్తూ, బ‌హిరంగ మ‌ల‌విస‌ర్జ‌న‌ను హాస్యపూరకంగా ఈ సినిమాలో చూపించారు. మెట్టినింట్లో టాయ్‌లెట్ లేక‌పోవ‌డంతో పుట్టింటికి వెళ్లిపోయిన ప్రియాంక భార‌తీ క‌థ ఆధారంగా శ్రీ నారాయ‌ణ్ సింగ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఈ చిత్రానికి ఐక్యరాజ్య సమితి నుంచి కూడా విశిష్ట గుర్తింపు రావటం విశేషం. ఇప్ప‌టికే ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద రూ. 80 కోట్లు వ‌సూలు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Toilet Ek Prem Katha  Haryana Government  Sarpanches  

Other Articles