బాహుబలి మాయ నుంచి బయటపడేసేదెవరో? | Baahubali Impact continues in Bollywood.

Baahubali maaya in bollywood continues

Bollywood, Baahubali Mania, Baahubali Effect, Baahubali The Conclusion Bollywood, Baahubali 2 Effect 2017 Movies, Baahubali 2 Movie, Bollywood Bad Year 2017

Baahubali The Conclusion Movie shows it impact till four months after Release in Bollywood. It is hard to collect 100 crores after baahubali 2 release in Hindi includng top stars.

బాహుబలిని బీట్ చేసే సినిమా ఇక రాదా?

Posted: 08/17/2017 05:36 PM IST
Baahubali maaya in bollywood continues

బాలీవుడ్ ఈ యేడాది బ్యాడ్ టైం నడుస్తూనే ఉంది. బాహుబలి ది కంక్లూజన్ లాంటి ఓ ప్రాంతీయ చిత్రానికి 500 కోట్లు కట్టబెట్టిన అక్కడి ప్రజలు తర్వాత రిలీజ్ అయిన ఏ చిత్రానికి అంతగా ఆదరణ ఇవ్వలేకపోతున్నారు. అందుకు కారణం రాజమౌళి వేసిన అరుదైన స్టాంపే అందుకు కారణమని చెప్పనక్కర్లేదు. గ్రాండియర్, లావిష్ నెస్, విజువల్ ఎఫెక్ట్స్, అన్నింటికి మించి ఫస్ట్ పార్ట్ సస్పెన్స్ ను కొనసాగిస్తూ బాహుబలిని భారీ ప్రాజెక్టుగా నిలబెట్టగా, విడుదలయ్యాక కూడా అదే ఫీల్ ను కొనసాగించి 1700 కోట్ల కలెక్షన్లు రాబట్టగలిగాడు.

సాధారణంగా బాలీవుడ్ సినిమాలకు వందల కోట్లు పెద్ద కష్టమైన పని కాదు.. అలాంటిది ఈ యేడాది ప్రారంభం నుంచే గట్టిగా ఒక్క సినిమా కూడా 150 కోట్లు రాబట్టలేదంటే అతిశయోక్తి కాదు. షారూఖ్ రయిస్ దగ్గరి నుంచి మొదలైన బాలీవుడ్ 2017 ప్రస్థానం రీసెంట్ గా అక్షయ్ కుమార్ టాయ్ లెట్ దాకా మరీ ముక్కున వేలెసుకునేలా వసూళ్లు రాబట్టాయి. మరీ ముఖ్యంగా బాహుబలి 2 తర్వాత సినిమాలు ఎలాంటి కలెక్షన్లు రాబడతాయో అని ఎదురుచూసిన బాలీవుడ్ జనాలకు నిరాశే ఎదురవుతోంది.

సల్మాన్ ట్యూబ్ లైట్, షారూఖ్ జబ్ సజల్ మెట్ హ్యారీ మరీ ఘోరంగా దెబ్బతీస్తే.. మిగతావి మినిమమ్ వసూళ్లు కూడా రాబట్టలేకపోయాయి. ఉన్నంతలో హిందీ మీడియం మాత్రం లాభాల పంట పడించినా అది చిన్న సినిమా కావటంతో వంద కోట్ల లోపే వసూలు చేసింది. మరి బాహుబలి మాయ నుంచి అక్కడి జనాలను బయటపడేసే ఆ చిత్రం ఏదవుతుందోనన్న చర్చ ఇప్పుడు అక్కడ ఆసక్తికరంగా మారింది.


ఈ యేడాది బాలీవుడ్ లో టాప్ 10 కలెక్షన్ల చిత్రాల లిస్ట్ ను ఓ లుక్కేస్తే...

Bollywood Movies Collections in 2017

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali 2  Bollywood 2017 Movies  Bad Year  

Other Articles