సూరీ చారు కోసం కవిత, చెర్రీ అండ్ సెలబ్రిటీస్ | Kavitha and Ram Charan Launches Surender Reddy Restaurant

Director surender reddy enters restaurant business

Director Surender Reddy, Surender Reddy Ulavacharu Restaurant, Surender Reddy Ulavacharu Restaurant Launch, Ram Charan MP Kavitha, Kavitha Ram Charan Surender Reddy Ulavacharu Restaurant, Celebs at Surender Reddy Ulavacharu Restaurant Photos

Ram Charan and MP Kavitha Launches Surender Reddy Ulavacharu Restaurant at Gachibowli.

సురేందర్ రెడ్డి కొత్త బిజినెస్.. ఉలవచారు రెస్టారెంట్ ప్రారంభం

Posted: 08/17/2017 04:09 PM IST
Director surender reddy enters restaurant business

ఓవైపు సినిమాలతోనే కాదు.. మరోపక్క వ్యాపార రంగంలోనూ సెలబ్రిటీలు రాణిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ కు చెందిన పలువురు రకరకాల వ్యాపారాల్లోకి అడుగు పెట్టారు. సీనియర్ హీరో నాగార్జున, మెగా పవర్ స్టార్ రాంచరణ్, హీరోయిన్ రకుల్ ఇలా క్రేజీ స్టార్లంతా వ్యాపార రంగంలో దూసుకుపోతున్నారు. మహేష్ చెర్రీ లాంటి బెస్ట్ ఫ్రెండ్స్ అయితే పార్టనర్లుగా బిజినెస్ ను ప్రారంభించేందుకు కూడా సిద్ధమైపోతున్నారు.

తాజాగా ఈ లిస్ట్ లో టాలీవుడ్ దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా జాయిన్ అయిపోయాడు. రీసెంట్ గా రెస్టారెంట్ బిజినెస్ లోకి అడుగుపెట్టేశాడు. నగరంలోని గచ్చిబౌలిలో 'ఉలవచారు' పేరుతో రెస్టారెంట్ ను ప్రారంభించాడు. వాస్తవానికి సొంతంగానే రెస్టారెంట్ ను ప్రారంభించాలని ఆయన భావించినప్పటికీ, ఎంతో పాప్యులర్ అయిన ఉలవచారు రెస్టారెంట్ ఫ్రాంఛైజీని తీసుకున్నాడు. ఈ రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత, హీరో రామ్ చరణ్ లు హాజరై సందడి చేశారు. వీరితోపాటే జగపతిబాబు, దర్శకులు సుకుమార్,వంశీపైడిపల్లి తదితరులు హాజరయ్యారు.

ఇక సినిమాల పరంగా చిరంజీవి 151వ చిత్రం ఉయ్యలవాడ నరసింహారెడ్డిని డైరక్ట్ చేయబోతున్నాడు. నిన్ననే సినిమా పూజా కార్యక్రమం ప్రారంభం కాగా, త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నాడు. చిరుతో సినిమా తర్వాత ఓ యంగ్ స్టర్ తోనే సూరీ సినిమా ఫ్లాన్ చేయబోతున్నాడని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Director Surender Reddy  Ulavacharu Restaurant  Ram Charan  Surender Reddy  

Other Articles