బిగ్ బాస్ లోకి తాప్సీ.. టీఆర్పీ కోసమే! | Taapsee Participate in Bigg Boss Show

Taapsee to participate in ntr bigg boss

Taapsee Pannu, Taapsee NTR, NTR Helps Taapsee, Taapsee New Movie Promotions, Taapsee in Bigg Boss Show, Taapsee Entrance in Bigg Boss, Taapsee NTR Prbhas

Actress Taapsee Pannu Participate Telugu Bigg Boss Show. For her latest movie Anando Brahma Promotions she entered into NTR's bigg boss house.

ఎన్టీఆర్ బిగ్ బాస్ లోకి తాప్సీ.. ఎందుకంటే...

Posted: 08/17/2017 03:44 PM IST
Taapsee to participate in ntr bigg boss

నో డౌట్.. వరుస హిట్లతో ఊపు మీద ఉన్న ఎన్టీఆర్ స్టార్ హీరో చెయిర్ కు దగ్గరయ్యాడనే చెప్పుకోవాలి. అదే సమయంలో బుల్లితెరపై బిగ్ బాస్ షో తో దుమ్ముదులుపుతున్న యంగ్ టైగర్ సీనియర్ హీరోలకు కూడా సాధ్యం కానీ టీఆర్పీ రేటింగ్ ఫీట్ ను ఎంతో అవలీలగా చేసి చూపించాడు. అయితే షోలో జూనియర్ హైలెట్ అవుతున్నాడే తప్ప మిగతా ఎపిసోడ్స్ అన్నీ అంత ఎఫెక్టివ్ గా ఉండటం లేదన్న వాదన కూడా వినిపిస్తోంది.

ఆ సంగతి పక్కన పెడితే ప్రస్తుతం ఈ షోకి క్రేజ్ బాగానే ఉండటంతో స్టార్లు తమ చిత్రాల ప్రమోషన్ కోసం వాడేసుకోవటానికి సిద్ధమైపోతున్నారు. మొన్నా మధ్యే నేనే రాజు నేనే మంత్రి కోసం రానా బిగ్ బాస్ షోకి అటెండ్ అయ్యి సందడి చేసింది తెలిసిందే. ఇక ఇప్పుడు ఓ హీరోయిన్ కూడా తన సినిమా కోసం రాబోతుందని తెలుస్తోంది.

తాజాగా హీరోయిన్ తాప్సీ తన ఆనందో బ్రహ్మ చిత్ర ప్రమోషన్ కోసం బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసిందనేది సమాచారం. రానా ఎలాగైతే పంచెకట్టులో సందడి చేశాడో... ఈ హర్రర్ కామెడీకి తగ్గట్లుగా తాప్సీ కూడా డిఫరెంట్ గెటప్ లోనే హాజరైనట్లు చెబుతున్నారు. ఆడియో వేడుక కోసం ప్రభాస్ ను రప్పించిన ఢిల్లీ బ్యూటీ, ఇప్పుడు ఎన్టీఆర్ షోను వాడేసుకుంటుంది. మరి తాప్సీ ఏ రీతిన హంగామ చేసిందో తెలియాలంటే ఈ ఆదివారం వరకు ఓపిక పట్టాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Taapsee  NTR  Bigg Boss Show  

Other Articles