నెగటివ్ రివ్యూ.. అయిన టీజర్ టాప్ | SPYder Teaser New Youtube Record

Mahesh spyder new record

Mahesh Babu, SPYder Teaser, SPYder Records, SPYder Teaser Records, SPYder Teaser Review

Mahesh Babu SPYder Creates New Record with Teaser. Already 1 Crore Views Crossed.

స్పైడర్ టీజర్ కొత్త రికార్డు

Posted: 08/12/2017 05:21 PM IST
Mahesh spyder new record

టాలీవుడ్ సూపర్ స్టార్ బైలింగువల్ మూవీ స్పైడర్ టీజర్ ఇంటర్నెట్ లో దుమ్మురేపుతోంది. బ్యాట్ మెన్ కాపీ అంటూ కొన్ని కామెంట్లు వినిపించినప్పటికీ, టీజర్ ను వీక్షించే వాళ్ల సంఖ్య మాత్రం అస్సలు తగ్గట్లేదు. మహేష్ బర్త్ డే సందర్భంగా విడుదలైన టీజర్ తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌లైన ఈ టీజ‌ర్ కి అప్పుడే కోటిన్న‌ర డిజిట‌ల్‌ వ్యూస్ వ‌చ్చాయి.

మొదటిరోజు 8.6 మిలియన్ వ్యూవ్స్ రాగా, యూ ట్యూబ్‌లో ట్రెండింగ్ వీడియోల్లోనూ టాప్ ప్లేస్‌లో ఉంది. ఒక్క తెలుగులోనే 6 మిలియన్ల దాకా వ్యూవ్స్ రావటం విశేషం. త‌మిళ ద‌ర్శ‌కుడు మురుగదాస్ రూపొందిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. కొత్త క‌థాంశంతో వ‌స్తున్న ఈ సినిమాపై ప్రేక్ష‌కులు ఎంత‌గా ఆస‌క్తిగా ఉన్నారో ఈ సినిమా టీజ‌ర్ కు వ‌స్తోన్న స్పంద‌న బ‌ట్టే అర్థం చేసుకోవ‌చ్చు.

ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా, త‌మిళ దర్శకుడు ఎస్ జే సూర్య, మరో కోలీవుడ్ నటుడు భ‌ర‌త్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. సెప్టెంబర్ 27న స్పైడర్ ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  SPYder Teaser  New Records  

Other Articles

Today on Telugu Wishesh