Vijay welcomes woman journalist critic అభిమానులు.. మీకు ఇది తగునా..!

Vijay speaks out against online abuse of woman journalist by his fans

social media trolling, vijay dhanya rajendran, vijay fans abuse dhanya rajendran, sura, sexual harassment, woman journalist, vijay news, when harry met sejal, sura, entertainment

Days after a senior woman journalist came under vicious attack from the self-proclaimed fans of Tamil movie star Ilayathalapathy Vijay, the actor issued a statement condemning the incident and requested his fans not to share “hurtful and wrong views” about women on social media.

అభిమానులు.. మీకు ఇది తగునా..!

Posted: 08/10/2017 03:39 PM IST
Vijay speaks out against online abuse of woman journalist by his fans

తమిళ హీరో విజయ్‌ అభిమానులను సున్నితంగా మందలించాడు. అభిమానులూ మీకిది తగునా అన్నట్లుగా ఆయన సోషల్‌మీడియా ద్వారా ఓ సందేశం పంపారు. ఓ జర్నలిస్టుపై తన అభిమానులు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న వ్యతిరేక ప్రచారానికి అయన స్వస్తి పలకాలని హితవు పలికాడు. అందునా మహిళలను మన సమాజం ప్రత్యేకంగా గుర్తింస్తుంది. వారిపై తనకు అపారమైన గౌరవం వుందని కూడా పేర్కోన్నారు. ఇకపై తన అభిమానులు మహిళా జర్నలిస్టుపై దూషణల పర్వాన్ని నిలిపేయాలని కోరాడు.

ధన్య రాజేంద్రన్‌ అనే జర్నలిస్ట్‌ విజయ్‌ సినిమాపై వ్యాఖ్యలు చేయడంతో ఆయన అభిమానులు ఆమెను నోటికొచ్చినట్లు తిడుతూ కామెంట్లు గుప్పించారు. విజయ్ అభిమానుల నుంచి వస్తున్న కామెంట్ల  టార్చర్ భరించలేక ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీనిపై స్పందించిన విజయ్.. ‘మహిళల పట్ల నాకు గౌరవం ఉంది. సినిమా నచ్చకపోతే బాగాలేదు అది చెప్పే స్వేచ్ఛ ఎవ్వరికైనా ఉంటుంది. కాబట్టి మహిళల గురించి తప్పుగా మాట్లాడం.. కామెంట్లు పోస్టు చేయడం వంటివి చేయొద్దు’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు.

ఇంతకీ జరిగిందేంటీ అంటే.. షారుక్ ఖాన్ నటించిన ‘జబ్‌ హ్యారీ మెట్ సెజల్‌’ సినిమా చూసి ‘ఈ సినిమా కొన్నేళ్ల క్రితం విజయ్ నటించిన ‘సురా’ చిత్రం కంటే దరిద్రంగా ఉంది’ అని ట్వీట్ చేసింది. దాంతో విజయ్ అభిమానులు మూడు రోజుల వ్యవధిలో 63 వేల ట్వీట్లు చేసి ఆమెకు నరకం చూపించారు. దాంతో ధన్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ధన్య ఓ న్యూస్ వెబ్ సైట్ కు మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. దీంతో హీరో విజయ్ జోక్యం చేసుకుని అభిమానులు మీకిది తగునా..? అంటూ ట్విట్ చేశారు. ఇప్పటికైనా విజయ్ అభిమానులు ఆయనకు తగ్గట్టుగా నడుచుకుంటారేమో వేచి చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh