setback for Kajal in madras HC కటకటా.. కాజల్ కు ఎంత కష్టమెచ్చిందో..!

Kajal agarwal loses her case in madras hc

kajal aggarwal, kajal, hair oil company, VVD Coconut oil, madras high court, kajal Commercials, Kajal Ads, tollywood, tollywood news, film news, celebs news

The Madras High Court has dismissed a civil suit of star heroine, Kajal Aggarwal, seeking Rs 2.50 crore from VVD Coconut oil, for violating the agreement between them.

అయ్యయ్యో... కాజల్.. ఇలా జరిగిందేంటి చెప్మా..

Posted: 08/10/2017 02:59 PM IST
Kajal agarwal loses her case in madras hc

సినీమా నటులు, నటీమణులు టీవీ కమర్షియల్స్ లోనూ ఎంతగానో రాణిస్తారు. అందుకు కారణం వారి అభిమానులు సదరు ఉత్సాదనలను వాడతారని వాణిజ్య వేత్తల నమ్మకం. అలాగే కెరీర్ ప్రారంభంలో ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ కూడా తమిళనాడుకు చెందిన వీవీడీ కొబ్బరి నూనె సంస్థ తరపున ఓ వాణిజ్య ప్రకటన చేసింది. అయితే వారిద్దరి మధ్య జరిగిన ఒప్పందాలు కూడా జరిగారు. కేవలం ఒక్క సంవత్సరం మాత్రమే తాము ఈ కమర్షియల్ ను టీవీలు.. ఇతరాత్ర సాధనాల్లో వినియోగిస్తామని సంస్థ ప్రతినిదులు లిఖితపూర్వకంగా మాటకూడా ఇచ్చారు.

అయితే 2008లో తీసిన ఈ యాడ్ ను వీవీడి సంస్థ ఇప్పటికీ ప్రసారం చేస్తుందని, ఈ యాడ్ నేపథ్యంలో తనతో చేసుకున్న ఒప్పందాన్ని సంస్త ఉల్లంఘించిందని కాజల్ అగర్వాల్ సంస్థపై 2011లో కేసు వేసింది. తనతో చేసుకున్న ఒప్పందం ప్రకారం కేవలం ఏడాది మాత్రమే తన యాడ్ ను ప్రదర్శిస్తామని చెప్పి.. ఇప్పిటికీ తన కమర్షియల్ తో ప్రచారం చేస్తున్నారని అమె తన పిటీషన్ లో పేర్కొనింది. తనకు రూ.2.5 కోట్ల పరిహారాన్ని ఇప్పించాలని, ఆ యాడ్ ను తిరిగి ప్రసారం చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ అమె ఏకంగా మద్రాసు హైకోర్టును అశ్రయింది.  

కాజల్ పిటిషన్‌ను విచారించిన కోర్టు ఆమె పిటీషన్ ను కొట్టివేసింది. అంతేకాదు కమర్షియల్ పై కాజల్ వ్యక్తపర్చిన అభ్యంతరాలను కూడా తోసిపుచ్చింది. చట్టప్రకారం ఆ ప్రకటన కాపీ రైట్స్ దానిని రూపొందించిన సంస్థకే చెందుతాయని పేర్కొంది. ఆ ప్రకటనను ఒక్క ఏడాదే ప్రసారం చేయాలనే హక్కు కాజల్‌కు ఉండబోదని న్యాయస్థానం స్పష్టం చేసింది. వాణిజ్య ప్రకటన ప్రమోషన్ హక్కులు ఆ సంస్థకు 60 ఏళ్ల వరకు ఉంటాయని న్యాయమూర్తి జస్టిస్ టి.రవీంద్రన్ పేర్కొన్నారు. దీంతో కాజల్ అగర్వాల్ కు ఎదురుదెబ్బ తగిలింది..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles