regina long wait star keeps her in dark రెజీనా నక్షత్రం అడ్డంగా తిరిగిందేంటీ..?

Regina cassandra long wait star keeps her in dark

Sundeep Kishan, Regina Cassandra, regina, nakshatram, krishna vamshi, Sundeep Kishan, Pragya Jaiswal, Prakash Raj, tollywood, entertainment

south indian actress regina cassandra long wait film nakshatram, which she hoped to turn her luck keeps her in dark after movies turns to be disaster

రెజీనా నక్షత్రం అడ్డంగా తిరిగిందేంటీ..?

Posted: 08/09/2017 05:39 PM IST
Regina cassandra long wait star keeps her in dark

టాలీవుడ్ ఇండస్ట్రీకి ఒకప్పుడు హీరోయిన్ల కొరత ఏర్పడింది. అయితే క్రమంగా ఈ రంగంపై మక్కువ చూపుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరగుతుండటంతో.. ఇండస్ట్రీకి మరో సమస్య వచ్చి పడింది. అదేంటి హీరోయిన్ల సంఖ్య ఎక్కువతే లాభామేగా, సమస్య ఏంటీ అంటారా..? కొత్తగా వస్తున్న హీరోయిన్లు తమ అద్భుత నటనతో ప్రేక్షకులను అకట్టుకుంటున్న తరుణంలో.. ఇప్పటికే సినిమా ఇంటస్ట్రీని నమ్మకుని వచ్చిన వారు కొత్తవారితో పోటీ పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

ఇప్పటికే హీరోయిన్ గా తమ నటనాభినయంతో గుర్తింపు తెచ్చుకున్న కథానాయికలు తమ స్థానాన్ని కాపాడుకోవడానికి, పడరాని పాటు పడాల్సి వస్తుంది. హీరోయిన్ గా మరికొన్నాళ్ల పాటు నిలదొక్కకునేందుకు కధానాయికలు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి కథానాయికల జాబితాలో.. రెజీనా కూడా చేరిపోయింది. ఇటీవల కాలంలో తెలుగులో రెజీనాకి అవకాశాలు బాగా తగ్గాయి. మరోలా చెప్పాలంటే అమె కూడా ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది.

తాజాగా అమె తెలుగులో నటించిన చిత్రం 'నక్షత్రం' కూడా ఆలస్యంగానే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై కొండంత అశ పెట్టుకున్నా రెజీనాకు ఆ చిత్రం ఫలితం నిరాశనే మిగిల్చింది. ఈ సినిమా హిట్ కొడితే .. తెలుగులో మళ్లీ బిజీ అవుతానని ఎన్నో అశలు పెట్టుకున్న రెజినాకు అడియాశలే ఎదురయ్యాయి.  ఇప్పుడామె చేతిలో కొత్తగా ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. తమిళ సినిమాలు మాత్రం మూడు వున్నాయి. దాంతో అక్కడైనా నిలదొక్కుకోవాలనే గట్టి పట్టుదలతో ఉంది రెజీనా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : regina  regina cassandra  nakshatram  krishna vamshi  Sundeep Kishan  tollywood  entertainment  

Other Articles