రానా అరుపులు.. టీవీ ఛానెల్ చీప్ పబ్లిసిటీ | Drugs Question Rana Fire on Anchor

Rana shouted on news channel anchor

Rana, Rana Shout TV9 Anchor, Rana Dhanush TV9 Interviews, Rana About Parcel, Rana TV9, TV9 TRP Cheap Tricks, Rana ABout Drug Case, Rana Drug Case, Rana on Drug Issue, Rana Fire on Anchor, Hero Rana Shout Anchor

TV9 again plays cheap trick with Rana interview. In the Part of Nene Raju Nene Mantri promotion Rana Gave an interview. while asking about drug case Rana suddenly shouted on anchor. That was used by Channel for Promotion. Actually Rana Later Explain That Parcel Issue with Cool Attitude.

డ్రగ్స్ ప్రశ్నతో యాంకర్ పై రానా ఫైర్

Posted: 08/08/2017 10:23 AM IST
Rana shouted on news channel anchor

టీఆర్పీలు, హిట్స్ కోసం ఈ మధ్య కొందరు చేసే వ్యవహారాలు వెగటును పుట్టిస్తున్నాయి. పైన హెడ్డింగులు ఒకటి, లోపల కంటెంట్ లు మరోకటి, అవసరమైతే దానికో వీడియోను తగలించేసి తెగ వైరల్ చేసేస్తున్నాయి. ‘రోడ్డు మీద బరిగితెగించిన హీరోయిన్.. రచ్చ’అని ఉంటుంది.. తీరా లోపలికెళ్లి చూస్తే ఏదో పాట షూటింగ్ విజువల్స్ కనిపిస్తాయి. ఇలాంటి వ్యవహారలు ఇప్పుడు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చేస్తున్నాయి.

రీసెంట్ గా తమిళ స్టార్ ధనుష్ ఓ తెలుగు న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని మధ్యలో పర్సనల్ ప్రశ్నలు రావటంతో స్గుపిడ్ ఇంటర్వ్యూ అంటూ వాకౌట్ చేయటం, ఆపై కేవలం సినిమాకు
సంబంధించిన ప్రశ్నలు మాత్రమే అడుగుతామంటూ నిర్వాహకులు ఇచ్చిన హమీతో తిరిగొచ్చి దానిని పూర్తి చేయటం తెలిసిందే. కానీ, సదరు ఛానెల్ వాళ్లు మాత్రం ధనుష్ సీరియస్ అయిన ప్రోమోను వాడేసుకుని వ్యూవ్స్ తెచ్చేసుకున్నాయి. సరిగ్గా ఇప్పుడు ఇలాంటిదే మరోకటి జరిగింది.

 

నేనే రాజు నేనే మంత్రి చిత్ర ప్రమోషన్ లో భాగంగా అదే ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో రానా సంయమనం కోల్పోయాడు. డ్రగ్స్ కేసు, ఈ మధ్య పార్సిల్ రావటం లాంటి ప్రశ్నలు రావటంతో చిర్రెత్తుకొచ్చిన రానా ఒక్కసారిగా సీరియస్ అయ్యి యాంకర్ పై అరవటం ప్రోమో హల్ చల్ చేస్తోంది. అయితే తర్వాత కూల్ గా రానా పూర్తి వివరణతో సమాధానం ఇవ్వటం ఇంటర్వ్యూలో వీడియో చూడొచ్చు. ఏదేమైనా ధనుష్ వ్యవహారంతో చెన్నైలో అల్రెడీ తెలుగు మీడియాపై ఇప్పటికే ఓ మార్క్ పడగా, ఇలాంటి ప్రోమోలు ఆసక్తి రేకిత్తించటం మాటేమోగానీ మరిన్ని విమర్శలకు దారితీస్తాయన్నది మాత్రం చెప్పొచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Daggubati Rana  Drug Case  TV9 Interview  Nene Raju Nene Mantri Movie  

Other Articles