మేమేం పోర్న్ సినిమా తీయలేదు కదా! | Baadshaho is Not A Porn Movie

Baadshaho team clarity on censor rumours

Ajay Devagan, Ajay Devagan Baadshaho Censor, Baadshaho Censor Rumours, CBFC Baadshaho, Baadshaho Censor Report, Baadshaho CBFC War, Baadshaho Censor Ajay Devagan, Ajay Devagan

Ajay Devagan Clarity on Baadshaho Censor. We are not making porn movie, and hope so CBFC not making trouble us he clarified.

బాద్ షా హో సెన్సార్ పై అజయ్ రియాక్షన్

Posted: 08/08/2017 12:04 PM IST
Baadshaho team clarity on censor rumours

బాలీవుడ్ లో బూతు లేకుండా సినిమా తీయటం ఇప్పుడు చాలా కష్టతరంగామారిపోయింది. మేకర్స్ తో గత కొంత కాలంగా సెన్సార్ బోర్డు ఆడేసుకుంటుంది. పహ్లాజ్ నిహ్లానీ కత్తెర దెబ్బకు సినిమాలు అల్లకల్లోలం అవుతున్నాయి. ఆ బాధిత చిత్రాల జాబితాలో అజయ్ దేవగన్ లేటెస్ట్ చిత్రం బాద్ షా హో కూడా చేరిపోయిందని చెప్పుకుంటున్నారు.

వన్స్ అప్ ఆన్ ఏ టైం ఇన్ ముంబై, డర్టీ పిక్చర్స్ చిత్రాల దర్శకుడు మిలాన్ లుథ్రియా రూపొందించిన చిత్రంలో మెయిన్ లీడ్ పెయిర్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అజయ్-ఇలియానా, హష్మీ-సన్నిలియోన్ మధ్య వేడెక్కించే సీన్లు తెరకెక్కించినట్లు చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు కట్స్ తప్పవనే వార్త హల్ చల్ చేస్తోంది. దీనిపై ట్రైలర్ లాంఛింగ్ సందర్భంగా దర్శకుడు మిలాన్ స్పందించాడు . ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపాడు.

అయితే మిలాన్ మాట్లాడుతుండగానే మధ్యలో కల్పించుకున్న అజయ్ మైక్ లాక్కుని మరీ ఇలాంటి వార్తలు ఎలా పుడతాయో మాకు తెలీదంటూ చెప్పుకొచ్చాడు. కానీ, నేనొకటి మాత్రం ఖచ్ఛితంగా చెప్పగలను. మేమేం పోర్న్ సినిమాలు తీయ లేదు అని పేర్కొన్నాడు. అంతే.. సీనియర్ నటుడు అయిన అజయ్ నోటి నుంచి వచ్చిన ఈ కామెంట్స్ ఇప్పుడు సినిమాకు ఫ్రీ ప్రచారాన్ని తెచ్చిపెడుతున్నాయ్. బంగారం దొపిడీ నేపథ్యం కథాంశంతో తెరకెక్కుతున్న బాద్ షా హో సెప్టెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ajay Devagan  Baadshaho Movir  Censor Report  

Other Articles