కొరటాలను టార్చర్ పెట్టాడు.. పీకేద్దామనుకునే లోపే... | Prakash Raj Irritated Mahesh Babu Director

Koratala irritated by prakash raj

Prakash Raj, Prakash Raj Koratala Siva, Prakash Raj Irritating Behaviour, Prakash Raj Shooting Delay, Bharat Anu Nenu Prakash Raj, Bharat Anu Nenu Movie, Mahesh Bharat Anu Nenu Movie Shooting

Prakash Raj again didi it. Versatile Actor troubling koratala Siva and Bharat Anu Nenu team with his tardiness.

కొరటాల ను ఇరిటేట్ చేస్తున్న ప్రకాశ్ రాజ్

Posted: 08/08/2017 09:07 AM IST
Koratala irritated by prakash raj

టాలీవుడ్ లో విలక్షణ నటుడిగా, ముక్కుసూటి తననానికి మారు పేరున్న ప్రకాశ్ రాజ్ పై అప్పట్లో చాలా ఫిర్యాదులు వినిపించాయి. ఎప్పుడూ సెట్స్ కు ఆలస్యంగా వస్తాడని, సెట్ లో టెక్నీషియన్స్ తో దురుసుగా వ్యవహరిస్తాడనే అప్పట్లో తీవ్ర విమర్శలు చెలరేగాయి. ఒకానోకటైంలో ఓ దర్శకుడితో బహిరంగంగా విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నప్పటికీ తర్వాత పెద్దల జోక్యంతో వివాదం సర్దుమణిగింది.

అయితే సీనియర్ నటులే విలన్లుగా మారుతుండటం, రావు రమేష్ లాంటి వాళ్లు ఆ లోటు భర్తీ చేస్తుండటంతో ప్రకాశ్ రాజ్ కు పెద్దగా అవకాశాలు రావటం లేదనే చెప్పాలి. ఇదిలా ఉంటే కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు భరత్ అను నేను చిత్రం షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం ప్రకాశ్ రాజ్ ను తీసుకున్నాడు.

కానీ, ప్రకాశ్ రాజ్ తన వ్యవహార శైలిని మాత్రం మార్చుకోలేదంట. షెడ్యూల్ ప్రకారం గైర్హాజరు కావటంతో రెండు రోజులు షూటింగ్ కాన్సిల్ చేసుకోవాల్సి వచ్చిందని చిత్ర యూనిట్ చెబుతోంది. దీంతో ఆ పాత్రను వేరే వారిని సంప్రదించగా, విషయం తెలుసుకున్న ఈ సీనియర్ నటుడు హడావుడిగా షూటింగ్ స్పాట్ లో ప్రత్యక్ష మయ్యాడంట. మరోసారి ఇలా చెయ్యొద్దంటూ మేకర్లు కూడా హెచ్చరించినట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prakash Raj  Koratala Siva  Bharat Anu Nenu Movie  

Other Articles