బాహుబలి లా హైప్ కోసం మహేష్ ఆరాటం | Mahesh SPYder follows Baahubali Strategy

Foreign events ready for mahesh spyder

Mahesh Babu SPYder, Spyder Baahubali Strategy, Baahubali Business Spyder, Spyder Movie Mahesh Babu, Mahesh Spyder Events, Mahesh Next International, Mahesh New Movie Promotions, Baahubali Formula Spyder

Mahesh Babu SPYder goes International Level. In Malaysia and Singapore, we see the presence of large diaspora of Tamil. So, one promotional event is going to be held there. Another event is likely to be conducted either in Dubai or in New Jersey.

స్పైడర్ కోసం ఫారిన్ ఈవెంట్లు రెడీ

Posted: 08/01/2017 03:06 PM IST
Foreign events ready for mahesh spyder

బాహుబలితో ప్రభాస్ కు ఇప్పుడు ఎలాగైతే జాతీయ స్థాయి గుర్తింపు వచ్చిందో.. సుమారు 11 ఏళ్ల క్రితమే మహేష్ అలాంటి ఛాన్స్ ను మిస్ చేసేసుకున్నాడు. పొకిరితో సెన్సేషన్ క్రియేట్ చేసిన సూపర్ స్టార్ టాప్ చెయిర్ కు రీచ్ అయిన సమయంలో వరుస ఫ్లాపులతో రేసులో వెనక్కి వెళ్లిపోయాడు. అయినప్పటికీ నేషనల్ వైడ్ గా మోస్ట్ డిసైరబుల్ జాబితాలో ఇప్పటికీ మహేష్ పేరు వినిపిస్తూనే ఉంటుంది.

అయితే ఆ క్రేజ్ ను మళ్లీ పెంచేసుకునే ఛాన్స్ మురగదాస్ స్పైడర్ రూపంలో దక్కినట్లయ్యింది. ఇప్పటికే భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం ప్రమోషన్ కూడా అదే రేంజ్ లో ఫ్లాన్ చేశాడు. బాహుబలి తర్వాత ఇప్పుడు వస్తున్న ప్రతీ బిగ్ మూవీస్ ను దాంతోనే కంపేర్ చేయటం మొదలుపెట్టేయటం చూస్తున్నాం. అందుకే విజువల్ ఎఫెక్ట్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కానీ క్రేజ్ డైరక్టర్ కావాలనే ఆలస్యం చేశాడన్న ఓ రీజన్ ఉంది.

ఇదే సమయంలో సినిమాను ప్రపంచానికి పరిచయం చేయాలన్న ఫ్లాన్ లో మేకర్లు ఉన్నారు. ఇందుకోసం బాహుబలి మాదిరిగానే ఇంటర్నేషనల్ ప్రమోషన్ ఈవెంట్లు సిద్ధం చేసున్నారంట. లండన్, ప్యారిస్, కెనెడా, బీజింగ్, మాస్కో, సౌదీ ఇలా దాదాపు అన్ని ప్రధాన పట్టణాలలో స్పైడర్ సందడి మొదలుకాబోతుంది. వీటికి మహేష్ హాజరుకాకపోయినా.. కొచ్చి, చెన్నై, ముంబై ఈవెంట్లలో మాత్రం ప్రిన్స్ హజరవుతాడని సమాచారం. మరోవైపు తెలుగుతోపాటు కోలీవుడ్; హిందీలో కూడా నంబర్ ఆఫ్ స్క్రీన్లలోనే స్పైడర్ బొమ్మ పడేలా ఫ్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ 27 ఈ స్పై యాక్షన్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. యంగ్ హీరోలు వరుస హిట్లతో టఫ్ కాంపిటీషన్ ఇస్తుండటంతో తమ సినిమాలను జస్ట్ హిట్లు అనిపించుకుంటే మాత్రం కుదరదు కదా. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Spyder Movie  Baahubali  

Other Articles