విశాల్ కి అనుభవం లేదు.. సెల్వమణి విమర్శలు | Actress Husband Slams Hero Vishal over FEFSI Strike

Vishal suggests to fefsi strike

Actor Vishal, Vishal FEFSI Strike, Kollywood FEFSI Strike, Selvamani FEFSI Strike, Selvamani Vishal War, Selvamani Issue, Producer's Council

RK Selvamani Says Vishal Isn't Experienced Enough To Handle Producer's Council. Vishal Commenys on FEFSI Strike.

కోలీవుడ్ లో విశాల్ వర్సెస్ రోజా భర్త

Posted: 08/01/2017 04:48 PM IST
Vishal suggests to fefsi strike

కోలీవుడ్ లో హీరో విశాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇండస్ట్రీకి సంబంధం లేనివారితో షూటింగ్ లు జరుపుకొండంటూ వ్యాఖ్యలు చేసి కలకలమే రేపాడు. అధ్యక్షుడి హోదాలో విశాల్ చేసిన వ్యాఖ్యలపై పలువురు మండిపడుతున్నారు.

ప్రస్తుతం తమిళనాడులో సినిమా షూటింగ్ లు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (ఎఫ్ఈఎఫ్ఎస్ఐ) ఆందోళనకు దిగింది. ఈ నిరసనలో 24 సంఘాలకు చెందిన దాదాపు 25 వేల మంది సిబ్బంది పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 20 సినిమాల షూటింగ్ లు ఆగిపోయాయి. ఇందులో రజనీకాంత్ సినిమా 'కాలా' కూడా ఉంది.

అయితే వీరి డిమాండ్లను తమిళనాడు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (టీఎఫ్పీసీ) తోసిపుచ్చింది. ఇటీవల కాలంలో నిర్మాతల సంఘానికి, కార్మికుల సంఘానికి మధ్య విభేదాలు బాగా ముదిరిపోయాయి. ఈ నేపథ్యంలో, విశాల్ చేసిన సూచనపై పలువురు మండిపడుతున్నారు. నటి రోజా భర్త, కార్మికుల సంఘం అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి అయితే విశాల్ పై కాస్త ఘాటైన పదజాలమే వాడాడు. కార్మికుల పొట్ట కొట్టే విధంగా విశాల్ వ్యవహరించటం సరికాదని వ్యాఖ్యానించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actor Vishal  FEFSI Strike  Selvamani  

Other Articles