సిట్ వాళ్లిద్దరినే ఎందుకు త్వరగా వదిలేసింది? కేసు వీగిపోతుందా? | Why SIT Probed Few Hours for Tanish and Nandu

Nandu sit probe completed

Tollywood Drug Case, Tanish and Nandu, Nandu SIT Probe, Nandu Drug Case, Tanish Puri Drug Case, Drug Case SIT Report, SIT Tollywood Investigation, Narcotic Case Tollywood, Akun Sabharwal Silent Drug Case

Actor Nandu Attends SIT Investigation Over Involvement In Narcotic Case. Tollywood Celebrities probe completed in this case.

సిట్ సెలబ్రిటీల విచారణ పూర్తి.. నందు జస్ట్ 3 గంటలే!

Posted: 08/01/2017 02:22 PM IST
Nandu sit probe completed

డ్రగ్స్ కేసులో సెలబ్రిటీల సిట్ విచారణ ఎట్టకేలకు పూర్తయ్యింది. నోటీసులు పంపించిన 12 మంది టాలీవుడ్ ఆర్టిస్టులను రోజుకోకరి చొప్పున పూర్తి చేసేశారు. ప్రముఖ సినీ యువ నటుడు నందు అలియాస్ ఆనందకృష్ణ సిట్ విచారణ ముగిసినట్లయ్యింది. చివరి రోజు విచారణలో భాగంగా నటుడు నందు అలియాస్ ఆనందకృష్ణ హాజరుకాగా, కేవలం మూడే మూడు గంటల్లో విచారణనను పూర్తి చేసి పంపించేశారు.నందు ఎంత స్వేచ్ఛగా విచారణకు వచ్చాడో, అంతే స్వేచ్ఛగా విచారణ నుంచి వెళ్లిపోయాడు.

ఇక నిన్న తనీశ్ ను కూడా కేవలం కొద్ది గంటలే విచారించిన విషయం తెలిసిందే. పూరీ కెల్విన్ ల మధ్యే కాదు.. ఇతర సెలబ్రిటీ లమధ్య కూడా తనీశ్ డ్రగ్స్ సరఫరా చేశారంటూ కథనాలు వెలువడ్డాయి. అయితే విచారణ తర్వాత బయటకు వచ్చిన తనీశ్ తన పేరును అనవసరంగా బద్నాం చేయొద్దంటూ విజ్నప్తి చేశాడు. తండ్రి చనిపోయిన బాధలో ఉండగా, డ్రగ్స్ నోటీసులు రావటం చాలా బాధించిందని, తనకు సిగరెట్, మందు అలవాట్లు మాత్రం ఉన్నాయని చెప్పుకొచ్చాడు.

ఇక కెల్విన్ ఫోన్ డాటాలో నందు ఫోన్ నెంబర్ ఉండడంతో ఆ దిశగా సిట్ అధికారులు ప్రశ్నలు సంధించారు. విచారణకు ముందు, తరువాత ఎలాంటి ఒత్తిడికి గురికాకపోవడం విశేషం. తనకు ఎలాంటి దురలవాట్లు లేవని నందు స్పష్టంగా చెప్పిన సంగతి తెలిసిందే. అదే విషయాన్ని సిట్ అధికారులకు చెప్పిన నందు విచారణ కేవలం 3 గంటలపాటే సాగింది. సిట్ విచారణ ఎదుర్కొన్న వారిలో నందు మాత్రమే అత్యంత తక్కువ సమయం విచారణ ఎదర్కొన్న వ్యక్తిగా నిలిచాడు.

సుమారు 90 గంటల విచారణలో సేకరించిన వివరాలతో సిట్ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయనుంది. కెల్విన్, జిషాన్ తదితర డ్రగ్ సరఫరాదారుల కేసులో సిట్ విచారణ ఛార్జిషీటు కోసం సినీ నటులతో పాటు 27 మందిని విచారించినట్టు సమాచారం. అయితే ముఖ్యమంత్రి హామీ నేపథ్యంలో కేసు విచారణ, సిట్ దర్యాప్తు ఇక ముందుకు సాగుతుందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tollywood  Drug Case  SIT Probe  

Other Articles

Today on Telugu Wishesh