వామ్మో... ధనుష్ ప్రభాస్ లా మారిపోతాడా? | My Body will Never become like Prabhas

Dhanush on body fitness

Actor Dhanush, Actor Dhanush Prabhas, Prabhas Body, Dhanush Fitness, Dhanush in Gym, Body Fitness Dhanush, Dhanush Common People, Dhanush Like Prabhas, Dhanush Gym Photos

Actor Dhanush says I will Never Put Effort like Prabhas. The Tamil star hero is quite happy with the way he looks and he is proud of his body. Dhanush rightly thinks his body is his strength because when he goes out, there are millions who can relate themselves to Dhanush. He is the common man’s representative. He takes pride in calling himself as the representative of the common people.

నా ‘బాడీ’ లాంగ్వేజ్ కి తగ్గ సినిమాలే చేస్తా: ధనుష్

Posted: 07/28/2017 03:07 PM IST
Dhanush on body fitness

బాహుబలి లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టు కోసం ప్రభాస్ పడ్డ కష్టం ఏంటో మనం కళ్లారా చూశాం. ఐదేళ్ల పాటు ఆహార నియామలతోపాటు ఎన్నో గాయాలను తట్టుకుని మరీ నిలబడ్డందుకు డార్లింగ్ కు తగిన ప్రతిఫలం లభించి స్టార్ స్టేటస్ సంపాదించేసుకున్నాడు. అయితే ప్రభాస్ ను చూసి ప్రేరణతో మరికొందరు యంగ్ స్టర్లు అలా బాడీ డెవలప్ చేసేందుకు యత్నించారు. కానీ, తాము మాత్రం పులిని చూసి వాత పెట్టుకునే రకం కాదంటున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్.

అందుకే తాను ఏనాడూ బాడీ విషయంలో ప్రయోగాలు చేయబోనని అంటున్నాడు ధనుష్. వీఐపీ-2 ప్రమోషన్ లో పాల్గొంటున్న ధనుష్ ను ఈ మధ్య జిమ్ లో ఎక్కువ సేపు గడుపుతున్నారన్న ప్రశ్నకు సమాధానాలిచ్చాడు. తన బాడీకి తగ్గ పాత్రలే తప్ప మరో అటెంప్ట్ చేసే ప్రసక్తే లేదని చెప్పాడు. బాహుబలి ప్రభాస్ ఎక్కడ? నేను ఎక్కడ? నేను పుల్లలా ఉంటానని నాకు తెలుసు కేవలం ఫిట్ నెస్ కోసమే జిమ్ కు వెళ్తాను. నా బాడీని కష్టపెట్టుకునేందుకు అస్సలు ఇష్టపడనని అంటున్నాడు.

కెరీర్ మొదట్లో యాక్షన్ మూవీలతో తాను చాలా తప్పులు చేసినప్పటికీ, ఇప్పుడు అలాంటివి రిపీట్ చేయకుండా జాగ్రత్త పడుతున్నానని చెబుతున్నాడు. కామన్ మ్యాన్ రోల్స్ లో తనను చాలా మంది అభిమానిస్తున్నారు. అందుకే అలాగే కొనసాగాలని డిసైడ్ అయ్యా అని చెప్పేశాడు. తెలుగులో స్ట్రెయిట్ మూవీతో వీఐపీ-2 తో ధనుష్ మన ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actor Dhanush  Prabhas  Body Fitness  

Other Articles