Bollywood reaction on tollywood drug racket

Bollywood star hero about drug case

Tollywood Drug Case, Akshay Kumar Drug Links, Akshay Kumar Reaction Tollywood Drug Case, Bollywood Reaction Tollywood Drug Case, Akshay Kumar Toilet Promotion, Akshay Kumar Hyderabad Toilet Promotions, Bollywood Reaction Drug Cae

Bollywood Star Hero Akshay Kumar responds to Tollywood's Drug links. He Defends Actors, so many people addict this habit and he never takes Drugs.

టాలీవుడ్ డ్రగ్స్ దుమారంపై బాలీవుడ్ రియాక్షన్

Posted: 07/28/2017 06:21 PM IST
Bollywood star hero about drug case

టోటల్ సౌత్ లో గౌరవప్రదమైన ఇండస్ట్రీ అన్న మార్క్ ఉన్న టాలీవుడ్ కు డ్రగ్స్ మరకలు ఇప్పుడు అప్పుడే వదిలేలా లేవు. కోలీవుడ్ లో సంచలనం రేపిన సుచీలీక్స్ లాంటి వెగటు వ్యవహారం కంటే సమాజానికి ప్రమాదకరంగా మారిన మాదకద్రవ్యాల చెలామణికి మన పరిశ్రమ వేదికైందన్న విమర్శ మన మీడియా నుంచే విస్తరిస్తోంది. అయితే ఈ వ్యవహారం ఇప్పుడు బాలీవుడ్ కు చేరింది. డ్రగ్స్ వంటి చెడు అలవాట్ల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని చెబుతున్నాడు ప్రముఖ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్.

టాయ్ లెట్ ఏక్ ప్రేమ్ కథ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్న అక్కీ టాలీవుడ్ లో రేగుతున్న డ్రగ్స్ దుమారంపై స్పందించాడు. డ్రగ్స్ ను కేవలం సినిమావాళ్లే తీసుకుంటారని అనడం సరైంది కాదని చెప్పాడు. అయితే సినిమా వాళ్లకు ఉన్న ఫేస్ వాల్యూతో మీడియా వారిని ప్రముఖంగా చూపిస్తుందని, అందువల్లే సినిమావాళ్లు లక్ష్యంగా మారుతున్నారని ఆయన చెప్పారు. డ్రగ్స్ ను స్పోర్ట్స్ మన్స్, పొలిటీషియన్స్, బ్యాంకర్స్, బిజినెస్ మెన్ ఇలా రకాల వృత్తులకు చెందినవారు తీసుకుంటారని చెప్పాడు.

 

వాటికి బానిసలు అయ్యి తాత్కాలిక ఉపశమనం పొందాలని కొందరు చూస్తున్నారే తప్ప తర్వాతి తమ జీవితాలు నాశనం అవుతాయని ఎవరూ గుర్తించటం లేదని అంటున్నాడు. తన వరకు ఎలాంటి చెడు అలవాట్లు లేవని, తన తల్లి చేసిన వంటకాలు తీసుకుంటానని చెప్పుకొచ్చాడు. కష్టపడి పని చేయటం మూలంగానే తాను ఇండస్ట్రీలో ఇలా ఈరోజు మీ ముందు ఉన్నానంటే అందుకు ఆరోగ్యవంతమైన తన దేహమే కారణమని చెప్పుకొచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bollywood  Akshay Kumar  Tollywood  Drug Case  

Other Articles