సల్మాన్ ఫ్యామిలీ ఫ్రెండ్, నటుడు మృతి | Salman Khan CO Star Died with Heart Attack

Bollywood actor inder kumar passes away

Salman Khan, Salman Fried Died, Salman Inder Kumar, Inder Kumar Died, Inder Kumar Heart Attack, Inder Kumar Rape Case, Salman Close Friend Died, Inder Kumar Death

Bollywood actor Inder Kumar who shared the screen space with Salman Khan in a couple of films passed away. Inder also briefly played Mihir Virani in the popular TV show Kyunki Saas Bhi Kabhi Bahu Thi. The actor was quite close to Salman Khan’s family as the two actors have worked together in several projects.

బాలీవుడ్ నటుడు ఇందర్ కుమార్ మృతి

Posted: 07/28/2017 02:35 PM IST
Bollywood actor inder kumar passes away

బాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. నటుడు ఇందర్ కుమార్ గుండెపోటుతో మరణించాడు. 43 ఏళ్ల ఇందర్ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు ఆప్తుడు. 20 ఏళ్ల కెరీర్ లో కేవలం 20 చిత్రాల్లో మాత్రమే నటించాడు. అందులో సల్మాన్ సినిమాలే అధికం.

అంధేరీలోని ఆయన నివాసంలో అర్థరాత్రి 2 గంటల సమయంలో ఆయనకు గుండెపోటు వచ్చిందని, ఆపై ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు పోయాయని తెలుస్తోంది. ఇందర్ కుమార్ అంత్యక్రియలు ఈ సాయంత్రం యారీ రోడ్డులోని శ్మశాన్ భూమిలో జరుగుతాయని బంధువులు వెల్లడించారు. ఇందర్ కుమార్ మృతిపట్ల సల్మాన్ ఖాన్ సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేశారు.

1996 లో మాసూమ్ తో ఆరంగ్రేటం చేసిన ఇందర్ కిలాడీయొంకి కిలాడీ, బాఘీ, మా తుజే సలాం, తుమ్ కో నా భూల్ పాయేంగే, వాంటెడ్ లలో నటించాడు. చోటీ సీ గుజారీష్ అతను నటించిన ఆఖరి చిత్రం. ఆయన భార్య పల్లవి షరాఫ్ స్టేజీ ఆర్టిస్ట్. గతంలో పని మనిషిపై అత్యాచారం చేశాడన్న ఆరోపణలపై ఇందర్ జైలుకు కూడా వెళ్లివచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bollywood  Inder Kumar  Salman Khan  Death News  

Other Articles