చెర్రీ ఆదుకుంటానన్న చిన్నారి చనిపోయాడు | Cherry Little Fan Bala Bhairava No More

Ram charan little fan died

Ram Charan, Ramcharan Parushuram, Baladheera Boy, Baladheera id, Baladheera Dialogues, Parasuram, Ram Charan Parushuram, Parushuram Kid, Parushuram Ram Charan, Ram Charan fan Died, Bala Bhairava Death, Ram Charan on Fan Death, Cherry Little Fan Died

Ramcharan Little Fan Bala Bhairava Aka Parushuram Died. The kid has reportedly succumbed to jaundice, A few years ago, amused by the little kid's talent, Charan personally met him and offered to bear his educational expenses.

ఒక్కోక్కరిని కాదు షేర్ ఖాన్.. బుల్లి భైరవుడు ఇక లేడు

Posted: 07/15/2017 03:47 PM IST
Ram charan little fan died

మగధీర చిత్రం డైలాగులతో హల్ చల్ చేసిన ‘బాల భైరవ’ఇక లేడు. మెగా పవర్ స్టార్ డై హార్డ్ ఫ్యాన్ అయిన ఈ చిన్నారి కామెర్ల వ్యాధితో చనిపోయాడు. దీంతో బాలుడి కుటుంబం, మెగా ఫ్యాన్స్ తీవ్ర విషాదంలో కూరుకుపోయారు.

గద్వాల జిల్లా ఇజా మండలంలో ఓ పల్లెటూరికి చెందిన పేద కుటుంబంలో పుట్టాడు పరశురామ్. ‘మగధీర’ రిలీజ్ టైంలో అందులోని డైలాగులన్నింటినీ అవపోసన పట్టేసి చెర్రీకి వీరాభిమానిగా మారిపోయాడు. హావభావాలతో సహా ఆ డైలాగులు చెబుతున్న వీడియో ఒకటి యూట్యూబ్ లోకి వచ్చి పిచ్చ పాపులరైంది. ఆ ‘బాలధీర’ వీడియో చూసి ఆశ్చర్యపోయి తన సిబ్బందిని పురమాయించి మరీ పరశురామ్ ను తన దగ్గరికి పిలిపించుకుని మాట్లాడాడు.

ఆ సందర్భంగా 'ఆరెంజ్' చిత్రంలో తను ధరించిన ఓ టీ షర్ట్ ను పరశురామ్ కి కానుకగా ఇచ్చాడు. వారి ఆర్థిక పరిస్థితి తెలుసుకుని పిల్లాడి బాగోగులు తాను చూసుకుంటానని.. చదువుకయ్యే ఖర్చు కూడా భరిస్తానని చరణ్ అప్పట్లో హామీ ఇచ్చాడు. బాలుడి హఠాన్మరణంతో నాటి వీడియోలు ఇప్పుడు మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. 


బాలుడు మృతి చెందాడన్న విష‌యం తెలుసుకున్న రామ్ చ‌ర‌ణ్‌తేజ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశాడు. ఆ చిన్నారి త‌న‌ను గ‌తంలో క‌లిసిన‌ప్ప‌టి ఓ ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసి, ఈ వార్త తెలుసుకుని షాక్‌కు గుర‌య్యాన‌ని అన్నాడు. ఆ బాలుడి కుటుంబ స‌భ్యుల‌కి ప్ర‌గాఢ సానుభూతి తెలుపుతున్న‌ట్లు చెబుతూ, 'ఆర్ఐపీ బ్రదర్' అని పేర్కొన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  Little Fan  Parushuram  

Other Articles

Today on Telugu Wishesh