NTR Bigg Boss Reality Get Set Ready

Ntr bigg boss starts from tomarrow

NTR, NTR Bigg Boss, Bigg Boss Opening Ceremony, NTR Bigg Boss Moments, NTR Show, NTR Dance Bigg Boss, Telugu Bigg Boss, Bigg Boss Inauguration

NTR Bigg Boss Show Starts from Tomorrow (July 16). In Pune Special Set show was conducted, NTR Special Dance Performance special attraction to this show.

బిగ్ బాస్ గెట్ రెడీ.. ఎన్టీఆర్ స్పెషల్ కూడా...

Posted: 07/15/2017 06:55 PM IST
Ntr bigg boss starts from tomarrow

జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న 'బిగ్ బాస్' రియాల్టీ షో కి రంగం సిద్ధమైంది. పుణేలో వేసిన భారీ సెట్టింగ్ అదేనండీ బిగ్ బాస్ హౌజ్ లో ఈ షో జరుగుతున్నట్లు సమాచారం. మొత్తం 12 మంది సెలబ్రిటీలు 70 రోజుల పాటు ఒక బిగ్ హౌస్ లో గడపనున్నారు. మొత్తం 60 కెమెరాలు వీరిని గమనించనున్నాయి.

జూనియర్ అభిమానులతోపాటు యావత్ తెలుగు ప్రేక్షకులు ఈ షో కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరోవైపు, ఈ షో ప్రారంభం ఎలా ఉండబోతోంది? అనే ఆసక్తి పలువురిలో నెలకొంది.సోమవారం నుంచి శుక్రవారం దాకా రాత్రి 9.30 గంటలకు, శని ఆది వారాల్లో రాత్రి 9 గంటలకు షో ప్రసారం కాబోతుంది. షో లో పాల్గొనే సెలబ్రిటీలు ఎలాంటి ఫోన్ లు, నెట్ వాడటానికి వీల్లేదు.

ఇక ప్రారంభంకు స్పెషల్ అట్రాక్షన్ గా ఎన్టీఆర్ డాన్స్ పర్ఫామెన్స్ తో ప్రారంభమవుతుందనే టాక్. దీని కోసం ఎన్టీఆర్ డాన్స్ రిహార్సల్స్ కూడా చేశాడని యూనిట్ చెబుతోంది. రేపటి(ఆదివారం) ప్రారంభం కాబోయే షో ఎలా ఉండబోతుందో? ఎన్ని కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తుందో? వెయిట్ అండ్ సీ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  Bigg Boss Show  MAA TV  

Other Articles