టాలీవుడ్ లో చిన్నా పెద్దా తేడా లేకుండా స్టార్లు కొందరు డ్రగ్స్ వినియోగించటం వెలుగు చూడటంతో ప్రేక్షక లోకం షాక్ కి గురైందనే చెప్పుకోవాలి. లిస్ట్ లో మాస్ రాజా రవితేజ లాంటి ఎంటర్ టైనింగ్ హీరో పేరు కూడా వెలుగులోకి రావడంతో అందరూ అవాక్కయ్యారు. బయటకు వచ్చింది కొంత మంది పేర్లే, మరో లిస్ట్ తయారవుతోందనే ఎక్సైజ్ వర్గాల వ్యాఖ్యలు ప్రకంపనలు పుట్టించగా, దయచేసి అలాంటివి చేయకూడదని ఉన్నతాధికారులు, మా కార్యవర్గం రిక్వెస్ట్ చేస్తోంది.
అయితే, నోటీసులు అందుకున్న వారంతా డ్రగ్స్ వాడారా? లేదా? అనే విషయాన్ని పక్కనబెడితే కొంప ముంచింది మాత్రం వాట్సాపే అని తెలుస్తోంది. డ్రగ్ ముఠాతో వాట్సాప్ ద్వారా జరిపిన సంభాషణలే వాళ్ల గుట్టును బయటపెట్టేశాయి. ఇప్పటి వరకు నోటీసులు అందుకున్న వారితో పాటు వారి డ్రైవర్లు, పీఏలు, సన్నిహితుల పాత్ర కూడా ఇందులో ఉందని తేలింది. మరోపక్క డ్రగ్స్ వ్యవహారంలో లింక్ ఉన్న సినీ ప్రముఖుల సంఖ్య 27 అయితే ఇప్పటి వరకు 12 మందికి నోటీసులు జారీ అయ్యాయి. మిగిలిన 15 మంది ప్రముఖుల పేర్లు బయటకు రాలేదు. అయితే వాళ్లకు సంబంధించిన క్లూ లు మాత్రం ఇప్పుడు హల్ చల్ చేస్తున్నాయ్.
టాలీవుడ్ లో అత్యంత కీలమైన కుటుంబం. ఆయనో ప్రముఖ నిర్మాత. ఆయనకున్న ఇద్దరు కుమారుల పేర్లు లిస్ట్ లో ఉన్నట్లు సమాచారం. గతంలో డ్రగ్స్ కేసుల్లో కూడా వాళ్ల పేర్లు హల్ చల్ చేశాయ్. కుర్ర హీరోతో, సొంత బ్యానర్ తో పరిశ్రమలోని దూసుకొచ్చిన ఓ నిర్మాత, చిన్న కథలు, కుటుంబ కథనాలతో భారీ హిట్లు కొట్టాడు. మూడో వ్యక్తి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి. క్రేజీ స్టార్ తో అనుకోకుండా హిట్ సినిమా నిర్మించి ఇప్పుడు సైలెంట్ గా ఉన్నాడు. ఒకప్పుడు ఫ్యామిలీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ ఆ హీరో. ఆ తర్వాత ఎలాంటి క్యారక్టర్ చేయడానికైనా సిద్ధమయ్యాడు. విలనిజంతో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకుంటున్నాడు. అయితే ఆయన మేనేజర్ ఫోన్ నంబర్ మాత్రమే కెల్విన్ కాంటాక్ట్ లిస్టులో ఉన్నట్లు తెలుస్తోంది. హీరోయిన్ల విషయాకొస్తే.. మరోకరు 2009లో టాలీవుడ్ లో అడుగుపెట్టి కుర్ర హీరోలతో వరుస హిట్లు కొట్టింది. ప్రస్తుతం బాలీవుడ్ కు చెక్కేసిందా హీరోయిన్. 2011, 2012లో ప్రముఖ హీరోలతో నటించి, హిట్లు కొట్టి, ఆఫై ఐరెన్ లెగ్ ముద్ర పడిన ఇద్దరు భామలు.
రవితేజ తమ్ముడు భరత్ తో పదే పదే పార్టీలకు, పబ్ లకు వెళ్లిన ఓ సహాయ నటుడు. ఇంకోకరు నటుడిగా కెరీర్ ను ప్రారంభించి ఆపై ప్రముఖ హీరోకు మేనేజర్ గా పని చేసే ఇప్పుడు వేరే వాళ్ల మేనేజర్ గా వ్యవహరిస్తున్నాడు. 2013 వరకు క్యారక్టర్ ఆర్టిస్టుగా అడపాదడపా సినిమాలు చేసి ఓ టాప్ హీరోతో సినిమా తీసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. లిస్ట్ లో మేకప్ మెన్, డ్రైవర్ల పేరుతో సిమ్ కార్డులు తీసుకుని డ్రగ్స్ వాడుతున్న ఓ విలక్షణ దర్శకుడి పేరు కూడా ఉందంట. మరో మిడిల్ ఏజ్ దర్శకుడు ఆయన ఇద్దరు మేనేజర్లు, ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు కెల్విన్ తో టచ్ లో ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ఇవి ఖచ్ఛితమైనవి కాదని, అనధికారం అనే విషయం గమనించాలి.
(And get your daily news straight to your inbox)
Jun 01 | బ్రహ్మాస్త్ర ఫిల్మ్‌కు చెందిన కొత్త అప్డేట్ వచ్చింది. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఈ ఫిల్మ్‌కు చెందిన కొత్త టీజర్‌ను రిలీజ్ చేశారు. ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్‌తో పాటు ఇతర స్టార్స్ ఉన్న ఆ... Read more
Jun 01 | బాలీవుడ్ ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నాథ్ హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 53 సంవత్సరాలు. కేకేగా చిరపరిచితమైన ఆయన కోల్‌కతాలోని నజురుల్ మంచా ఆడిటోరియంలో ప్రదర్శన ఇచ్చారు. కేకే పాటలకు స్టెప్పులేసిన అభిమానులు.. ఆ... Read more
May 30 | కరోనా లాక్ డౌన్ లో వాయిద పడ్డ సినిమాలన్ని వరుస పెట్టి విడుదల అవుతున్నాయి. గతేడాది పుష్ప, అఖండ, శ్యామ్ సింగరాయ్ వంటి సినిమాలు తెలుగు సినీ పరిశ్రమకు ధైర్యాన్ని ఇచ్చాయి. అదే క్రమంలో... Read more
May 30 | ఉప్పెన' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన బేబమ్మగా తెలుగు ప్రేక్షకుల హృదయాలలో సుస్థిర స్థానం ఏర్పర్చుకన్న మంగళూరు బ్యూటీ కృతిశెట్టి తన కెరీర్ లోనూ విజయాల పరంపరను సోంతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. తొలి... Read more
May 30 | యాక్టింగ్‌లోనే కాదు సినిమా ప్రమోషన్లలోనూ తన దారి సపరేటు అని నిరూపించారు ప్రముఖ నటుడు, టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌బాబు. తాను నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యానని చెప్పిన మహేశ్ బాబు.. త్వరలో విడుదల కానున్న... Read more