Why Aamir Khan ignore that A-listed Actor

Differences between aamir and divya bharti

Aamir Khan, Divya Bharti, Divya Bharti Aamir Khan Clash, Aamir Khan Divya Bharti Differences, Divya Bharti About Salman, Divya Bharti Juhi Chawla, Divya Bharti Darr, Darr Movie Clash, Aamir Khan Ignore Her

Aamir Khan forced director Yash Chopra to throw Divya Bharti from Darr. In March 1992, Divya lashed out on Aamir after he refused to perform with her during a tour in London. He claimed that he was disappointed with her erratic behaviour.

అమీర్ తో అసలు సమస్య ఏంటి?

Posted: 07/07/2017 06:04 PM IST
Differences between aamir and divya bharti

ఇండస్ట్రీకి వచ్చి వర్తమాన నటిగా టాప్ హీరోలతో చేస్తున్న టైంలోనే హఠాన్మరణం చెందింది నటి దివ్యభారతి. 19 ఏళ్ల వయసులోనే డ్రగ్స్ బానిసై ఆత్మహత్య చేసుకుందని చెప్పుకుంటూ ఉంటారు. 1990-93 మూడేళ్ల కాలంలో బాలీవుడ్‌ అగ్ర‌న‌టులంద‌రితోనూ న‌టించింది. షారూఖ్, జాకీ ష్రాఫ్, రిషి కపూర్, సౌత్ లో చిరంజీవి, మోహన్ బాబు, బాలయ్య ఇలా అందరితోనూ చేసిన ఆమె ఒక్క ఆమిర్ ఖాన్‌తో మాత్రం చేయలేదు‌.

దీనిపై అసలు కారణం ఏంటో స్వయంగా దివ్యభారతి తల్లి ఓ ఇంటర్వ్యూలో చెప్పటం ఓ ప్రముఖ పత్రిక బయటపెట్టింది. ఇందుకు వారిద్ద‌రి మ‌ధ్య 1992 మార్చిలో జ‌రిగిన గొడ‌వే కార‌ణ‌మ‌ని ముంబైలోని సినిమా మేగ‌జైన్ ప్రస్తావించింది. లండ‌న్‌లో జ‌రిగిన ఓ వేడుక‌లో ఆమిర్‌, దివ్య రిహార్స‌ల్ చేస్తుండ‌గా ఆమె కొన్ని స్టెప్పులు వేయటం మ‌ర్చిపోయిందంట.. దీంతో వేడుక‌లో జూహీ చావ్లాతో క‌లిసి ఆమిర్ డ్యాన్స్ వేశాడు. అదే టైంలో ఒంట‌రిగా స్టేజీ మీద ఏం చేయాలో తెలియ‌క స‌త‌మ‌తమవుతున్న దివ్య‌కు స‌ల్మాన్ సాయం చేశాడంట. ఈ విష‌యాల‌న్నీ వేడుక త‌ర్వాత జ‌రిగిన ఓ ఇంట‌ర్వ్యూలో దివ్య చెప్పుకొచ్చింది.

ఆమిర్ సీనియర్ అయితే త‌ప్పులు స‌రిచేయాలి కానీ ఇలా చేస్తారా? అని తిడుతూ, స‌ల్మాన్ వ్య‌క్తిత్వం చాలా గొప్ప‌ది అంటూ ఇంట‌ర్వ్యూలో చుర‌క‌లు వేసిందంట దివ్య‌. తర్వాత యశ్ రాజ్ వారు అమీర్, సన్నీడియోల్, దివ్యభారతితో డర్ ఫ్లాన్ చేశారు. అదే సమయంలో దివ్యభారతి అమెరికాలో ఉండటం, అమీర్ దివ్య కామెంట్లను దృష్టిలో పెట్టుకుని జూహీని తీసుకుంటేనే తాను చేస్తానని యశ్ రాజ్ పై ఒత్తిడి తెచ్చాడంట.

చివరకు అమీర్ డిమాండ్ కు తలొగ్గి జూహీని తీసేసుకోవటం, తర్వాత అనివార్య కారణాలతో అమీర్ కూడా డ్రాప్ కావటంతో షారూఖ్ ఆ ప్లేస్ లోకి వచ్చి చేరాడు. అఫ్ కోర్స్ షారూఖ్ సైకో యాక్టింగ్ మూలంగానే డర్ ఎంత పెద్ద హిట్టయ్యిందో.. షారూఖ్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అయ్యిందో తెలిసిందే. ఈ విషయాలన్నీ ఆమె తల్లి ఇప్పుడు ఓ ప్రముఖ మాగ్జైన్ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Divya Bharti  Aamir Khan  Darr Movie Clash  

Other Articles