SRK Costly Gift to Close Super Star

Salman khan in srk s new mercedes

Salman Khan New Car, Salman New Costly Car, Mercedes-Benz Salman Khan Costly Gift, Salman SRK Costly Bond, Shah Rukh Khan Car Salman

Shah Rukh Khan reportedly gifted Salman Khan costly car. Shah Rukh apparently gifted Salman Khan the latest model of Mercedes-Benz as a thank you token for starring in his upcoming film,

ఖాన్ ల బంధం అంత కాస్ట్ లీనా?

Posted: 07/08/2017 11:07 AM IST
Salman khan in srk s new mercedes

బాలీవుడ్ కరణ్ అర్జున్ లు అదేనండీ షారూఖ్, సల్మాన్ లు స్నేహ మాధుర్యంలో విహరిస్తున్నారు. కొంత కాలం క్రితం వరకు వీరిద్దరి మధ్య తీవ్ర స్థాయిలో మనస్పర్థలు ఉండేవి. వీటి వెనుక ఓ స్టార్ హీరో ఉన్నాడంటూ బాలీవుడ్ మీడియా గుసగుసలాడింది కూడా. అయితే కొంత కాలంగా వీళ్లు మళ్లీ ఒకటయిపోయారు.

సల్మాన్ సిస్టర్ అర్పిత పెళ్లి నుంచి మొదలైన వీళ్ల బాండ్ ఇప్పుడు పీక్స్ లోకి వెళ్లిపోయింది. చూడలేకమనుకున్న సీన్లు ఎన్నో చూడాల్సి వస్తుంది. సల్మాన్ ట్యూబ్ లైట్ లో అతిధిపాత్రలో షారూఖ్ కనిపిస్తే...షారూఖ్ కొత్త చిత్రం ద్వార్ఫ్ లో గెస్ట్ రోల్ సల్మాన్ చేస్తున్నాడు. మొన్నే సాంగ్ షూటింగ్ లో కూడా కండల వీరుడు పాల్గొనగా ఆ ఫోటోలు బయటకు వచ్చాయి కూడా. అయితే ఈ సందర్భంగా షారూఖ్ సల్మాన్ కు ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చినట్లు ఇప్పుడు బయటకు వచ్చింది.

ఓ బీఎండబ్ల్యూ లగ్జరీ కారును బహుమతిగా సెట్ లోనే అందజేశాడు. ఊహించని ఆ గిఫ్ట్ తో సల్మాన్ కూడా ఎంతో ఎగ్జయిట్ అయ్యాడంట. ప్రస్తుతం సల్మాన్ ఆ కారులోనే షికార్లకు వెళ్తున్నాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో షారూఖ్ కారులో సల్మాన్ అంటూ ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి. ఖాన్ హీరోల స్నేహానికి ప్రతీక అంటూ ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీలవుతున్నారు. మళ్లీ పాత రోజులను గుర్తు చేస్తూ వీరి బంధం ఇలాగే కొనసాగాలని మనమూ కోరుకుందాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Salman khan  SRK  Costly Car  

Other Articles