Thumbs Down Satellite Rates for Tollywood Biggies in Overseas

No takers for three crazy telugu films in overseas

Tollywood, Tollywood2017 Movies, Tollywood Overseas Satellite Rights, SPYder Jai Lavakusa and Pawan Trivikram Movie, Jai Lavakusa Overseas Satellite Rights, Spyder Overseas Satellite Rights, Pawan Trivikram Overseas Satellite Rights

Shocking Satellite Rates for Tollywood Biggies in Overseas. Distributors are not willing to take the gamble as exhibitors in many big centres are not showing interest due to the new revenue rules. Spyder, Jai Lavakusa and Pawan Movie Effected with this.

పెద్ద సినిమాలు.. శాటి లైట్- పిచ్చ లైట్

Posted: 06/22/2017 12:44 PM IST
No takers for three crazy telugu films in overseas

టాలీవుడ్ సినిమాలకు రాను రాను బడ్జెట్ రేంజ్ పెరిగిపోతుంది. అదే సమయంలో దానికి తగ్గట్లుగానే బిజినెస్, హిట్ అయితే గనుక భారీ బిజినెస్ లే జరుగుతున్నాయి. ఒకవేళ పూర్ టాక్ వచ్చినా సేఫ్ జోన్ లోనే ఉండేలా నిర్మాతలు హక్కులను అమ్ముకుంటుడటంతో డిస్ట్రిబ్యూటర్లపైనే ఆ భారం పడుతోంది. దానికి తోడు కొత్తగా వచ్చిన రూల్స్ కూడా వారికి మరింత ఇబ్బందికరంగా మారాయి.

ఈ నేపథ్యంలో త్వరలో రాబోతున్న ఓ మూడు భారీ సినిమాలపై పెనుప్రభావం చూపటం మొదలుపెట్టేసింది. ఎన్టీఆర్ జైలవకుశ, మహేష్ స్పైడర్, పవన్-త్రివిక్రమ్ మూవీలకు ఓవర్సీస్ బిజినెస్ పై డిస్ట్రిబ్యూటర్లు కూడా అంతగా ఆసక్తి చూపటం లేదని తెలుస్తోంది. ముందుగా మహేష్ స్పైడర్ ను 22 నుంచి 25 కోట్లకు విక్రయించేందుకు మేకర్లు సిద్ధమయ్యారు. చివరకు 16 కోట్లకు డీల్ క్లోజ్ చేద్దామన్న ఎవరూ ముందుకు రావటం లేదని సమాచారం.

ఇక తొలిసారి ట్రిపుల్ రోల్ లో ఎన్టీఆర్ నటిస్తుండటంతో జై లవకుశ మీద కూడా భారీగానే అంచనాలు ఉన్నాయి. నిర్మాత కళ్యాణ్ రామ్ ఓవర్సీస్ డీల్ ను ముందు 16-18 కోట్ల మధ్య అనుకుని, చివరకు 14 కోట్ల దగ్గర ఆగిపోగా దాని మీద పెద్దగా ఆసక్తి చూపటం లేదంట. మరోవైపు పవన్ త్రివిక్రమ్ కేజ్రీ కాంబినేషన్, పైగా ఓవర్సీస్ లో పవన్ ట్రాక్ రికార్డుల మీద 20 కోట్లకు డీల్ మాట్లాడగా, అందుకు కూడా ఎవరూ సాహసం చేయలేకపోతున్నారంట. ఫ్రాపిట్ లు వచ్చినా కొత్త రెవెన్యూ రూల్స్ కారణంగా టాక్స్ మీద అంతా పోను పెద్ద లాభాలు మిగలకపోవటమే ఇందుకు కారణమని స్పష్టమౌతోంది. మొత్తానికి రాబోయే భారీ బడ్జెట్ చిత్రాలకు పెద్ద దెబ్బే పడేలా ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tollywood  2017 Movies  Overseas Satellite Rights  

Other Articles