తన చేష్టలతో, నిర్ణయాలతో నిత్యం వార్తల్లో నిలిచే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కొత్త అవతారం ఎత్తబోతున్నాడు. త్వరలో ఆయన ముఖానికి మేకప్ వేసుకుని ఓ సినిమాలో నటించబోతున్నాడు. అయితే అందుకోసం ఆయన రీల్ సీఎంగా మారబోతున్నాడని సమాచారం. కన్నడ యంగ్ లేడీ డైరక్టర్ కవితా లంకేశ్ ‘సమ్మర్ హాలిడేస్’ పేరుతో ఓ సినిమా తీయబోతుంది. కన్నడతోపాటు ఇంగ్లీష్ లోనూ అది తెరకెక్కిస్తుందంట. ఇందులో సీఎం పాత్రలో ఆయన నటించనున్నారని ప్రకటించింది
ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు లేవన్న హామీ మీదే ఆయన నటించేందుకు అంగీకరించారని ఆమె తెలిపారు. ఆ వార్త నిజమేనంటూ సీఎం కార్యాలయం కూడా స్పందించింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన 80% షూటింగ్ పూర్తయిందని, కేవలం సీఎంపై చిత్రీకరించాల్సిన సన్నివేశాలు మాత్రమే మిగిలి ఉన్నాయని, సీఎం ఎప్పుడు అపాయింట్ మెంట్ ఇస్తే అప్పుడే చిత్రీకరణ జరుపుతామని కవిత తెలిపింది.
ఇక రామయ్య కాలేజీ రోజుల్లో సరదాగా నటించేవారంట. నటనపై ఆయనకు చాలా మక్కువ ఉందని, ఆ మక్కువతోనే ఆయన ఈ సినిమాలో నటించేందుకు అంగీకరించారని కుటుంబ సభ్యులు తెలిపారు. చిన్నపాత్రే అయినా మాంచి ఇంపాక్ట్ ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. కాగా, కవిత పాపులర్ కన్నడ రైటర్ దర్శకుడు అయిన లంకేశ్ కూతురు. సెలవుల్లో ఓ నలుగురు పిల్లలు చేసిన హంగామా మీదే ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more