Action Hero could not Essay Modi in Upcoming

Akshay kumar not in modi biopic

Akshay Kumar, Akshay Kumar Modi Biopic, Akshay Kumar Modi, Modi Biopic, Modi Anupam Kher, Modi Paresh Rawal, Modi Movie Role, Akshay Kumar Rumour

Akshay Kumar Isn't Playing PM Narendra Modi. But, Pahlaj Nihalani thinks he is suitable for such role.

మోదీ బయోపిక్ ఫర్ ఫెక్ట్ ఛాయిస్, కానీ...

Posted: 06/22/2017 01:03 PM IST
Akshay kumar not in modi biopic

సోషల్ మీడియాలో ఎక్కడో ఏదో మూల పుట్టుకొచ్చే ఒక న్యూస్. దానిని పట్టుకుని ఛానెళ్లు ఆడుకోవటం. ఆపై అది కాస్త వైరల్ అయిపోవటం ఇప్పుడు చాలా కామన్ గా మారింది. ముఖ్యంగా సెలబ్రిటీలకు సంబంధించి గుడ్డో బ్యాడో ఎలాంటి వార్తైనా సరే క్షణాల్లో పాకిపోతున్నాయి. రీసెంట్ గా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కు సంబంధించిన ఓ వార్త నెట్ లో తెగ వైరల్ అవుతోంది.

అక్షయ్ కుమార్ తన తర్వాతి చిత్రంలో ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రోల్ లో కనిపించబోతున్నాడనేది దాని సారాంశం. ప్రస్తుతం ఈ సీనియర్ హీరో టాయ్ లెట్, పాడ్ మన్ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇవి రెండూ సామాజిక స్పృహ ఉన్న అంశాలే. దీంతో మోదీపై సినిమా కూడా ఆల్ మోస్ట్ నిజమే అని అంతే భావించారు. అంతే వెంటనే అతను ఫర్ ఫెక్ట్ ఛాయిస్ అంటూ పలువురు ఓపినీయన్లు ఇవ్వటం కూడా ప్రారంభించేశారు.

దీంతో రియాక్ట్ అయిన అక్కీ అదంతా ఫేక్ న్యూస్ అని కొట్టి పడేశాడు. తాను మోదీ బయోపిక్ లో నటించటం లేదని తేల్చేశాడు. అయినప్పటికీ సెన్సార్ బోర్డు చైర్ పర్సన్ పహ్లజ్, సీనియర్ నటుడు శతృఘ్నసిన్హాలు కూడా మోదీ రోల్ కి అక్షయే ఫర్ ఫెక్ట్ ఛాయిస్ అని చెబుతుండటం విశేషం. ఆ మధ్య మోదీ బయోపిక్ కోసం పరేష్ రావెల్, అనుపమ్ ఖేర్ ల పేర్లు ప్రస్తావనకు రాగా ఎందుకో అది తెరకెక్కలేదు. అయితే ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ చిత్రం ద్వారా మన్మోహన్ సింగ్ రోల్ లో అనుపమ్ ఖేర్ నటిస్తున్న విషయం తెలిసిందే.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bollywood  Akshya Kumar  Modi Biopic  

Other Articles