Mega Daughter Second Movie Officially Launched

Niharika konidela signs second film

Niharika Konidela, Niharika Konidela Second Movie, Niharika Second Movie, Niharika Konidela Nara Rohit, Niharika Konidela Movies List, Ravi Durga Prasad Director, Niharika Second Movie Hero, Ravi Durga Prasad, Niharika Konidela New Movie Launch Photos, Niharika Konidela Second Movie Launch Photos

Niharika Konidela is back with her second film announced and to be launched today on new banner MR Entertainments and Kavitha Combines jointly produced by Marisetti Raghavaiah and Bandaru Bobby.Ravi Durga Prasad is making his debut as director who earlier assisted Prabhudeva.

నిహారిక రెండో సినిమా స్టార్ట్.. ఎవరితోనంటే...

Posted: 06/16/2017 11:52 AM IST
Niharika konidela signs second film

మెగా ఫ్యామిలీ నుంచి అభ్యంతరం వ్యక్తం అయినప్పటికీ హీరోయిన్ గానే కెరీర్ ను ఎంచుకుంది నిహారిక కోణిదెల. అయితే తొలి మూవీ ఒక మనసు అంతగా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోవటంతో ఇక చిత్రాలు చేస్తుందా? అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ, ఆ అంచనాలను పటాపంచల్ చేస్తూ రెండో మూవీ మొదలుపెట్టేసింది.

శుక్రవారం ఉదయం ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో నిహారిక సెకండ్ మూవీ ముహుర్తం షాట్ తో పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ కార్యక్రమానికి మెగా బ్రదర్ నాగ బాబు, శ్రీకాంత్, మారుతి, దర్శకుడు మెహర్ రమేష్ లు హాజరయ్యారు.

మెగా మేనల్లుడితో పెళ్లి?

రవిదుర్గ ప్రసాద్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రంతో పరిచయం కాబోతున్నాడు. ఎంఆర్ ఎంటర్ టైన్ మెంట్స్ మరియు కవిత కంబైన్స్ బ్యానర్ల మీద బండారు బాబీ, మరిశెట్టి రాఘవయ్య చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంతకు మరాఠీ మూవీ హ్యాపీ జర్నీ రీమేక్ లో నటిస్తుందనే వార్తలు వచ్చాయి. మరి ఆ చిత్రమో కాదో తేలాల్సి ఉంది. ఇంకోవైపు నారా రోహిత్ తో ఓ సినిమాలో నటించబోతుందన్న వార్తలు ఆ మధ్య వినిపించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Niharika Konidela  Second Movie  Ravi Durga Prasad  

Other Articles