Nakshatram Movie Gets a Release Date

Dinally krishna vamshi get relief

Nakshatram, Nakshatram Movie, Nakshatram Release Date, Krishna Vamshi Nakshatram, Nakshatram Release Date, Nakshatram July 11, Nakshatram New Movie

Nakshatram Movie get Release Date. Creative Director Krishna Vamsi's Flick which was earlier planned for May release missed that.

ఆ సినిమా అడ్డంకులన్నీ తొలగిపోయాయి

Posted: 06/15/2017 06:11 PM IST
Dinally krishna vamshi get relief

టాలీవుడ్ డైరక్టర్ కృష్ణ వంశీ కెరీర్ గత కొన్నేళ్లుగా అస్తవ్యస్తంగా ఉంది. సరైన హిట్లూ లేవు, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోతో సినిమా మిస్ అవ్వటం, ఓవైపు సినిమాలు అనుకున్న టైంకి రిలీజ్ కాక ఒడిదుడుకులు ఎదుర్కుంటున్నాడు. గత చిత్రం పైసా విషయంలో జరిగినట్లే ఇప్పుడు కొత్త చిత్రం నక్షత్రం విషయంలో కూడా అదే సీన్ రిపీట్ అవుతోంది.

నిజానికి షూటింగ్ లాస్ట్ ఇయరే పూర్తి చేసుకున్నప్పటికీ ఈ యేడాది ప్రారంభంలోనే రావాల్సిన నక్షత్రం ఎందుకనో డిలే అవుతూ వస్తోంది. మే లో పక్కా రిలీజ్ అవుతుందని చెప్పినప్పటికీ ఆ తర్వాత ఊసే ఎవరూ ఎత్తలేదు. చివరకు ఏదైతేనేం సినిమా రిలీజ్ డేట్ పై ఓ క్లారిటీ వచ్చేసింది. జూలై 14న సినిమా రిలీజ్ అవుతున్నట్లు ప్రకటించేశాడు చిత్ర దర్శకుడు కృష్ణ వంశీ. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా మొదలు కావటంతో రిలీజ్ దాదాపు కన్ఫర్మ్ అయ్యిందనే అనుకోవాలి.

సందీప్ కిషన్, రెజీనా లీడ్ రోల్ గా, సాయి ధరమ్ తేజ్, ప్రగ్నా జైస్వాల్, ప్రకాష్ రాజ్ కీ రోల్స్ పోషిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ తప్పక హిట్ అయి తీరుతుందన్న ధీమాలో ఉన్నాడు కృష్ణ వంశీ. ఈ మధ్యే రిలీజ్ అయిన ట్రైలర్ కూడా డీసెంట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా వంశీ కే కాదు ఇందులోని హీరోహీరోయిన్ల కెరీర్ కు కూడా చాలా కీలకం కానుంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nakshatram  Krishna Vamshi  Release Date  

Other Articles