ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో చరిత్రను తిరగరాసిన బాహుబలి ది కంక్లూజన్ కు 50 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుంది. మొత్తం 1700 కోట్లతో హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలవటమే కాదు.. ఇండియాలో ఇప్పటిదాకా ఎక్కువ వసూళ్లు రాబట్టిన చిత్రంగా కొత్త రికార్డులు నెలకొల్పింది. (దంగల్ చైనా వసూళ్లతో ఈ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది)
రాజమౌళి చెక్కిన ఈ కళాఖండం వెనుక ఐదేళ్ల కష్టం ఉన్న విషయం తెలిసిందే. ఓ తెలుగు చిత్రం భారతీయ సిల్వర్ స్క్రీన్ పై ఇంతలా మ్యాజిక్ చేస్తుందని బహుశా బాలీవుడ్ కూడా ఊహించి ఉండదేమో. ఫస్ట్ డే వసూళ్లే కాదు.. ఫాస్టెస్ట్ 500, 1000, 1500 కోట్లు, హిందీలో 500 కోట్లు ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్నీ రికార్డులు బాహుబలి ఖాతాలో పడ్డాయి.
ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ ప్రధాన పాత్రల్లో నటించిన బాహుబలి సిరీస్ దేశంలోని అన్ని లాంగ్వేజ్ ల్లో ఎక్కువ కలెక్షన్లు సాధించిన చిత్రంగా చరిత్ర సృష్టించింది. త్వరలో చైనాలో రిలీజ్ కు రెడీగా ఉన్న ఈ ఇండియన్ గ్రాండియర్ మూవీ అక్కడ తన కలెక్షన్లతో టాప్ ప్లేస్ లో నిలవాలని ఆశిద్దాం.
తెలుగులో బాహుబలి చిత్రం సమీప కాలంలో ఎవరూ అందుకోలేనంత ఎత్తుకు చేరుకుంది. బాహుబలి చిత్రం ఏపీ, తెలంగాణాల్లో కలిపి దాదాపు 198 కోట్లను వసూలు చేసింది. ఇంకా పలు చోట్ల సినిమా విజయవంతంగా ప్రదర్శితం అవుతున్న నేపథ్యంలో 200 కోట్ల షేర్ మార్కును అందుకునే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
ఇక ్రపతిష్టాత్మక మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్ లో బాహుబలి ది కంక్లూజన్ ప్రదర్శితం కాబోతుందని చిత్ర యూనిట్ ట్విట్టర్ ద్వారా తెలిపింది.
#Baahubali2 - The Conclusion to be screened at the 39th Moscow International Film Festival as the opening film!!https://t.co/aIiI4Kg40B
— Baahubali (@BaahubaliMovie) June 14, 2017
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more