Salman Khan Comments on South Star Heroes and Fans

Salaman reveals real reason for baahubali success

Salman Khan, Salman Khan Baahubali 2, Salman Khan Prabhas, Salman Khan Baahubali 2 Success, Salman Khan South Heroes, Salman Khan South Fans, Salman Khan Comments Baahubali 2, Salman Khan Tubelight Promotions

Salman Khan Reveals The Real Reason Why Baahubali Is A Magnum Opus Like No Other. Hindi audiences are accepting and they have made a Telugu film Baahubali 2 such a blockbuster. He also said that there is strong fan loyalty in South.

మా వల్లే బాహుబలి అంత హిట్టయ్యింది: సల్మాన్

Posted: 06/14/2017 02:38 PM IST
Salaman reveals real reason for baahubali success

నార్త్, సౌత్ తేడాలు ఒక్క రాజకీయాంశాల్లోనే కాదు.. సినిమాలకు సంబంధించి కూడా ఉంటాయన్నది బాహుబలి సక్సెస్ విషయంలో రుజువైంది. తెగించి కొందరు రాజమౌళి సినిమాపై ప్రశంసలు కురిపిస్తే... ఖాన్ త్రయం లాంటి వాళ్లు మాత్రం సినిమాను ఇంకా చూడలేదంటూ సెటైరిక్ గా కామెంట్లు చేయటం చూశాం. అసలు బాహుబలి ఆ స్థాయి సినిమా కాదని కూడా కొందరు కామెంట్స్ చేశారు. సౌత్ నుంచి ఓ రీజినల్ మూవీగా వచ్చి 500 కోట్లు వసూలు చేసేయటం సహజంగానే వాళ్లకు ఆ భావన కలగటానికి కారణం అయి ఉండొచ్చు.

అలాంటి చిత్రంపై బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ట్యూబ్ లైట్ ప్రమోషన్ లో మరోసారి కామెంట్స్ చేశాడు. బాహుబలి- ది కన్ క్లూజన్ బాలీవుడ్ లో అంత పెద్ద రికార్డు ఎలా అయ్యిందో చెబుతూ ఓ కారణం చెప్పుకొచ్చాడు.అసలు అంత అద్భుత విజయానికి కారణం హిందీ ప్రేక్షకుల ఆదరణ అని ఒక్క మాటలో తేల్చేశాడు. దక్షిణాదికి చెందిన ఇద్దరు, ముగ్గురు నటీనటులు మాత్రమే బాలీవుడ్ కి ప్రేక్షకులకు తెలుసని, అయినప్పటికీ హీరో స్టార్ డమ్ చూడకుండా ఈ సినిమాను ఉత్తరాదికి చెందన ప్రేక్షకులు ఆదరించారని అన్నాడు.

సౌత్ లో తమ పాపులారిటీను ఎవరూ పట్టించుకోరని, తాము తెలిసినా తమ సినిమాలను పెద్దగా చూడరన్నాడు. ఉదాహరణకు కమలహాసన్, రజనీ ఫ్యాన్ లు చివరి దాకా వాళ్ల అభిమానులుగానే ఉంటారని, వారితో పోల్చుకుని తమ సినిమాలను అస్సలు ఆదరించరని తెలిపాడు. అందుకే తమ సినిమాలో దక్షిణాదిలో నేరుగా విడుదల చేసినా పెద్దగా వసూళ్లు రాబట్టవని చెప్పాడు. మొత్తానికి నార్త్ ఆడియన్స్ విశాల ధృక్ఫథం కారణంగానే బాహుబలి అంత పెద్ద సక్సెస్ అయ్యిందంటూ కంక్లూజన్ ఇచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Salman Khan  Baahubali 2  Tubelight  

Other Articles