The Accidental Prime Minister Movie first look out

The accidental prime minister first look

The Accidental Prime Minister, The Accidental Prime Minister ovie, The Accidental Prime Minister Role, The Accidental Prime Minister Manmohan Singh Movie, Manmohan Singh Movie, Anupam Kher Manmohan Singh, Anupam Kher Sonia Gandhi, Anupam Kher Movie, Anupam Kher Politician Biopic, Sanjay Baru Manmohan Singh Movie, Manmohan Singh Movie Controversy, Manmohan Singh Biopic

The Accidental Prime Minister' first look poster out. Anupam Kher to play Manmohan Singh Character.

ఫస్ట్ లుక్: మన్మోహాన్ ను చూపించారు.. చీకట్లో సోనియా

Posted: 06/07/2017 04:07 PM IST
The accidental prime minister first look

బాలీవుడ్ లో మరో ఇంట్రెస్టింగ్ బయోపిక్ వస్తోంది. యూపీఏ హయాంలో రెండు సార్లు ప్రధానిగా పని చేసిన మన్మోహన్ సింగ్ జీవిత కథ ఆధారంగా ఓ సినిమా రాబోతుంది. 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' అనే ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదలైంది. సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ మన్మోహన్ పాత్రలో నటించబోతున్నాడు.

పోస్టర్ లో... ఓ వైపుకు మన్మోహన్ సింగ్ తిరిగి ఉండగా... ఆయన ఫొటో బ్యాక్ గ్రౌండ్ లో ఓ మహిళ చీర కట్టుకుని నిలబడి ఉంది. అది కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన్మోహన్ మాజీ మీడియా సలహాదారు సంజయ్ బారు రచించిన 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్'(2014) పుస్తకం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. మే 2004 నుంచి ఆగస్ట్ 2008 వరకు మన్మోహన్ సలహాదారుగా సంజయ్ వ్యవహరించాడు.

యూపీఏ ప్రభుత్వం, అందులోని పెద్దలు మన్మోహన్ సింగ్ ను అచేతనుడిని చేశారంటూ తన పుస్తకంలో బారు ఆరోపించాడు. అత్యంత కీలకమైన నియామకాలు, నిర్ణయాలను మన్మోహన్ బదులు ఎవరు తీసుకున్నారో తెలుసంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. ఇక ఫస్ట్ లుక్ రిలీజ్ సందర్భంగా అనుపమ్ ఖేర్ తన స్పందనను ట్విట్టర్ ద్వారా తెలిపారు. "నటుడిగా మళ్లీ తనను తాను ఆవిష్కరించుకోవడం పెద్ద ఛాలెంజ్" అని తెలిపారు. మన్మోహన్ పాత్రలో ఒదిగిపోవడానికి ప్రయత్నిస్తున్నానని వెల్లడించాడు.విజయ్ రత్నాకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2018లో చిత్రం రిలీజ్ అయ్యే ఛాన్సుంది. వివాదాస్పద అంవాలను ఎలా చూపించబోతున్నారన్న ఆసక్తే ఇప్పుడు అందరిలో నెలకొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : The Accidental Prime Minister  Manmohan Singh Movie  Anupam Kher  

Other Articles