Rashmika and Rakshit confirm Engagement

Rakshit shetty and rashmika mandanna to exchange rings on july 3

Rashmika, Rashmika Husband, Rashmika Engagement, Rashmika Shetty, Rashmika Shetty Engagement, Rashmika Mandanna Rakshit Shetty, Kannada Couple Wedding, Kitty Party Couple Engagement

Kirik Party Couple Confirm their relationship. Rashmika Mandanna and Rakshit Shetty confirm that they'll be getting engaged this July

ప్రభాస్ జస్ట్ మిస్.. ఎంగేజ్ మెంట్ డేట్ చెప్పేసిన హీరోయిన్

Posted: 06/07/2017 02:27 PM IST
Rakshit shetty and rashmika mandanna to exchange rings on july 3

సౌత్ లో మరో సినీ సెలబ్రిటీ జంట మూడు ముళ్లతో ఏకం కానున్నారు. కన్నడ యంగ్ బ్యూటీ రష్మిక, దర్శకుడు కమ్ నటుడు రక్షిత్ శెట్టి పెళ్లికి రెడీ అవుతున్నారు. 2016 శాండల్ వుడ్ బ్లాక్ బస్టర్ కిరిక్ పార్టీ లో వీరిద్దరు జంటగా నటించటం విశేషం. తర్వాత ప్రేమ వార్తలతో వీళ్లు తరచూ వార్తల్లో నిలిచారు కూడా.

రక్షిత్ శెట్టి కన్నడ లో యువ నటుడే కాదు, పైగా కొన్ని సినిమాలును డైరెక్ట్ కూడా చేశాడు. రక్షిత్ శెట్టి పుట్టిన రోజు సందర్భంగా రష్మిక ఈ విషయాన్ని తన ఫేస్ బుక్లో పోస్ట్ చేసింది. “హాపీ బర్త్ డే మై డియర్ నా జీవితంలో నేను కలిసిన మంచి ముత్యం లాంటి మనిషివి నీవు. నిన్ను కలుసుకోవడం నీతో జీవితం పంచుకోవడం నాకు నా కుటంబానికి చాలా ఆనందంగా ఉంది. వెల్కమ్ టు మై బుజ్జి ఫ్యామిలి'' అని చెప్పింది.

ఆ విధంగా చూస్తే వీళ్ళ రిలేషన్ ను పెళ్ళితో శుభం కార్డు వేస్తున్నారనే అనుకోవాలి. జూలై 3న కుటుంబ సభ్యుల మధ్య ఎంగేజ్ మెంట్ కానిచ్చేసి తర్వాత కెరీర్ లో రెండేళ్లు బిజీ అయిపోవాలని భావిస్తున్నారు. ఇక రష్మిక తెలుగులో నాగ శౌర్య, రామ్ సినిమాలో నటిస్తుండగా, ప్రభాస్ సాహో రేసులో పేరు వినిపించినప్పటికీ కారణం తెలీదుగానీ ఆ ప్రాజెక్టుకు ఫైనలైజ్ కాలేకపోయింది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rakshit Shetty  Rashmika Mandanna  Kannada Couple  

Other Articles