Yet another controversy on Allu Arjun's DJ కాకరేపుతూ దూసుకుపోతున్న దువ్వాడ జగన్నాథమ్

Allu arjun dj song gudilo badilo surpasses 5 million mark amid controversy

dj, dj songs, dj movie songs, dj jukebox, dj video songs, dj full songs, Duvvada Jagannadham Audio Teaser, duvvada jagannadham audio songs, duvvada jagannadh, allu arjun, pooja hedge, brahmin groups, tollywood, entertainment

Stylish Star Allu Arjun's latest offering Duvvada Jagannadham has been making maximum buzz for its interesting theme amid brahmin groups protest

కాకరేపుతూ దూసుకుపోతున్న దువ్వాడ జగన్నాథమ్

Posted: 06/02/2017 05:17 PM IST
Allu arjun dj song gudilo badilo surpasses 5 million mark amid controversy

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అనగానే అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రక్షకులకు మంచి డాన్సర్ అని.. అయితే డైరెక్టర్ అవకాశం కల్పిస్తే.. డాన్స్ చించేస్తాడన్న అభిప్రాయాలు వున్నాయి. అందుకు తగ్గట్టుగా తన డాన్స్ విశ్వరూపాన్ని చూపే అవకాశం అల్లు అర్జున్ కు తాజా చిత్రం దువ్వాడ జగన్నాథమ్ లో లభించిందన్న టాక్ వినబడుతుంది. ఆయన డాన్స్ ను దృష్టిలో పెట్టుకునే సంగీత దర్శకులు బాణీలు కడుతుంటారు. ఇక అల్లు అర్జున్ స్టైల్ .. ఆయన బాడీ లాంగ్వేజ్ గురించి దేవిశ్రీ ప్రసాద్ కి బాగా తెలుసు. అందువల్లనే ఈ కాంబినేషన్లో వచ్చిన 'గుడిలో .. బడిలో .. మడిలో ఒడిలో..' సాంగ్ కి ఒక రేంజ్ లో స్పందన వస్తోంది.

కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే ఈ పాటను ఏకంగా 58 లక్షల మంది చూశారు. ఇంకా చూస్తున్నారు. ఓ వైపు ఈ చిత్రంలోని పాటపై అటు బ్రహ్మణ సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్న క్రమంలోనే మరింత మంది అభిమానులు ఈ పాటను వీక్షిస్తున్నారు. నమక, చమకాలను పాటలో వినియోగించి నిత్యం అరాధించే ఈశ్వర పదాలను అబాసుపాలు చేస్తున్నారని బ్రహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి. కాగా, ఈ పాటలో బన్నీ స్టెప్స్ .. పూజా హెగ్డే గ్లామర్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ సినిమా రిలీజ్ ఈ నెల 23న వుండటంతో, ఆ రోజు కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles