Thala Ajith Injured during Vivegam Shoot

Hala ajith injured

Thala Ajith Kumar, Ajith Kumar Vivegam, Vivegam Shoot, Vivegam Ajith Injured, Ajith Kumar Injure, Ajith Shoulder Injure, Vivegam Accident, Thala Injured

Thala Ajith Kumar Injured inShoot of Vivegam. Admitted in a hospital shooting interrupted.

తలా కు గాయాలు.. సీక్రెట్ గా ఎందుకు?

Posted: 06/01/2017 01:11 PM IST
Hala ajith injured

డూప్ ల సాయం లేకుండా రియల్ స్టంట్ లతో అలరిస్తూ ఉండే హీరోల్లో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఎప్పుడూ ముందుంటాడు. అలాంటి టైంలో ఈసీనియర్ హీరోకు గాయాలు తగలటం కూడా కొత్తేం కాదు. ఇంతకు ముందు వేదాలం షూటింగ్ సమయంలో కూడా పెద్ద గాయమే తగలటంతో ఏకంగా సర్జరీనే జరిగింది. ఇప్పుడు వివేగం షూటింగ్ సందర్భంగా మళ్లీ అలాంటిదే జరిగింది కూడా.

వీరం ఫేమ్ శివ దర్శకత్వంలో 'వివేగం' సినిమా రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం యూరప్ లో జరుగుతోంది. హాలీవుడ్ స్థాయిలో యాక్షన్ సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఇక ఎప్పటిలాగే ఫ్యాన్స్ ను థ్రిల్ చేయడం కోసం డూప్ లేకుండా యాక్షన్ సీన్స్ చేసేందుకు రెడీ అయ్యాడు అజిత్.

అలా ఓ యాక్షన్ సీన్ చిత్రీకరణ చేస్తుండగా హఠాత్తుగా అజిత్ పడిపోయాడట. దాంతో ఆయన భుజానికి గాయం కాగా, ఫస్ట్ ఎయిడ్ చేసి తర్వాత దగ్గర్లోని హాస్పిటల్లో చేర్పించారని సమాచారం. అభిమానులు ఆందోళన పడతారని ఈ విషయాన్ని బయటకు చెప్పొద్దని అజిత్ చెప్పినప్పటికీ, చిత్ర యూనిట్ లోని కొందరు లీక్ చేసేశారు. అజిత్ కోలుకోగానే ఈ సినిమా షూటింగ్ తిరిగి మొదలవుతుందని అంటున్నారు. కాజల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఆగస్టు చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Thala  Ajith Kumar  Shoulder Injure  

Other Articles