Mahesh Babu Spyder Teaser on June 1st

Surprise element in mahesh teaser

Mahesh Babu, Spyder Movie, Spyder Teaser, Spyder Movie Teaser, Spyder Teaser Postponed, Spyder Teaser Date, Spyder Teaser June 1st, Spyder Teaser Date, Spyder Teaser Theme, Spyder Teaser Graphics, Spyder Teaser Visuals

Mahesh Babu Starer Spyder Move Teaser Released on june 1st 10.30 AM. The Teaser was postponed due to death of Dasari Narayana Rao.

స్పైడర్ టీజర్ లో ఆ సర్ ప్రైజ్ ఎలిమెంట్ ఉంది

Posted: 05/31/2017 06:16 PM IST
Surprise element in mahesh teaser

మహేశ్‌ బాబు, మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్న ‘స్పైడ‌ర్’ మూవీ టీజ‌ర్ మరోక రోజు వాయిదా పడింది. దాసరి హఠాన్మరణంతో ఈ రోజు టోటల్ టాలీవుడ్ సినీ పరిశ్రమ సెలవును ప్రకటించుకోగా, అందుకు నివాళిగా స్పైడర్ టీం కూడా టీజర్ ను వాయిదా వేసేసింది. సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా త‌న కొత్త సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేస్తామని మ‌హేశ్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

ఈ రోజు కృష్ణ త‌న పుట్టిన రోజు వేడుకను జరుపుకోకుండా దాసరికి నివాళులు అర్పించాడు. అయితే స్పైడ‌ర్ సినిమా టీజ‌ర్ ను రేప‌టికి వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. రేపు ఉద‌యం 10.30 గంట‌ల‌కు ఈ టీజ‌ర్‌ను విడుద‌ల చేస్తున్న‌ట్లు ఆ సినిమా యూనిట్ తెలిపింది.

ఇక స్పైడర్ టీజర్ లో మూవీ థీమ్ ను ఎలివేట్ చేస్తూ స్పైడర్ ను హైలెట్ చేస్తూ టీజర్ ఉండబోతుందంట. మురగదాస్ నిర్మాతలను ఈ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కానివ్వలేదు. అందుకే లండన్ లో స్పెషల్ ఎఫెక్ట్స్ టీంతో ఈ పనులు చేయించాడు. మరి ఆ సర్ ప్రైజ్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే కొద్ది గంటలు ఆగాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Spyder Movie  Teaser Date  

Other Articles