ram charan asks fans to help him out అభిమానులు హెల్ప్ చేయరూ: రాంచరణ్

Ram charan asks fans to help him out

ram charam aska fans help, ram charan asks fans support, title, ramcharan, sukumar, samantha, twitter, facebook, instagram, tollywood, cinema news

tollywood mega power star ram charan tej ask fans to help him out in knowing the titile of his yet to release project by sending messages to him

అభిమానులు హెల్ప్ చేయరూ: రాంచరణ్

Posted: 05/28/2017 12:39 PM IST
Ram charan asks fans to help him out

మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ తేజ్.. తనకు హెల్ప్ చేయాలని అభిమానులను కోరుతున్నారు. అదేంటి అంతపెద్ద స్టార్ కు మేము సాయం చేయడమేంటి.. అనుకుంటున్నారా..  అవును నిజమే.. తనకు అభిమానులు హెల్స్ చేయాలని కోరుతూ ఆయన ఇవాళ తాజాగా ఓ వీడియో పోస్టు చేశారు. ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌, సమంత జంటగా ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ చిత్రానికి టైటిల్‌ను ఇంకా ఖరారు చేయలేదు.

ఔనా.. అయితే ఏ టైటిల్ పెడితే బాగుంటుందో చెప్పాలా.. ఓస్ అంతేగా అంటూ తొందరపడకండీ.. ఇక్కడే వుంది అసలు ట్విస్టు. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రానికి పలు రకాల టైటిల్స్‌ గురించి ఊహాగానాలు వచ్చినా ఇంకా టైటిల్ ను ఫిక్స్ చేయలేదని రామ్‌ చరణ్‌ తేల్చేశారు. గడిచిన నెల రోజులుగా సినిమాకు ఏదో మంచి టైటిల్‌ ఫిక్స్ చేయాలని టీమ్ మొత్తం దర్శకుడు సుకుమార్ ను కోరుతున్నట్లు చెప్పారు.

సినిమాకు నాలుగైదు మంచి టైటిల్స్ ను సుకుమార్ చెప్పినట్లు తెలిపారు. అయితే, వీటిలో ఏ టైటిల్‌ను ఫైనలైజ్ చేశారనే విషయాన్ని మాత్రం ఆయన చెప్పడం లేదన్నారు. ఈ విషయంలో సుకుమార్ ఏ టైటిల్ ను ఫిక్స్ చేశారన్నది తెలిపేలా అభిమానులు తనకు సాయం చేయాలని కోరారు. ఇందుకోసం అభిమానులు ఏం చేయాలన్నది కూడా చెర్రీ చెప్పేశారు. ఇవాళ సాయంత్రం ఏడు గంటల నుంచి సినిమాకు వారం నుంచి పది రోజుల్లోగా టైటిల్‌ను ఖరారు చేయమని ట్వీటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ అకౌంట్ల ద్వారా దర్శకుడు సుకుమార్‌ను కోరాలని అభ్యర్థించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : title  ramcharan  sukumar  samantha  twitter  facebook  instagram  tollywood  cinema news  

Other Articles