రోటిన్ కు భిన్నంగా వైవిధ్యభరితమైన కథా కథనంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'కేశవ' పాజిటివ్ టాక్ తో పాగా వేస్తుంది. ఎక్కడికి పోతావు చిన్నదానా చిత్ర విజయంతో మంచి జోష్ మీదున్న నిఖిల్ సిద్దార్థ్ కు ఈ చిత్రం మరింత అనందాన్ని ఇచ్చింది. దర్శకుడు సుధీర్ వర్మ ప్రతిభకి నూటికి నూరు మార్కులు వేసేస్తున్నారు ప్రేక్షకులు. కొత్త కంటెంట్ ను ఎంచుకుని.. దానిని అద్భుతంగా తెరపై ఆవిష్కరించడంతో విజయం సాధ్యమైందని సినీవర్గాల టాక్.
భారీ బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జక్కన చిత్రం బాహుబ-2ను తట్టుకుని కేశవ నిలుస్తాడా..? అన్న సందేహాలు కూడా ప్రేక్షకులలో తలెత్తాయి. నటీనటులు .. సాంకేతిక నిపుణుల పారితోషికం సహా అన్ని కలుపుకుని ఆరున్నర కోట్లు వ్యయంతో నిర్మించిన ఈ చిత్రం బాహుబలి ముందు నిలుస్తుందా..? అన్న సందేహాలకు సుధీర్ వర్మ ప్రతిభ చెక్ పెట్టింది. ఇటు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా అటు ఓవర్ సీస్ లో కూడా ఈ సినిమాకు పాజిటివ్ టాక్ మంచి ఓపెనింగ్స్ ను తెచ్చిపెట్టింది.
దీంతో సుధీర్ వర్మ మంచి డైరెక్టర్ గా పేరు తెచ్చుకోగా, రోటిన్ కు విభిన్నమైన కథంశాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నిఖిల్ కు తన నటనా ప్రతిభిను మరోమారు చాటుకున్నాడు. ఇక సినిమా తీసిన తీరు ఇండస్ట్రీ ప్రముఖులను సైతం ఆశ్చర్య పరుస్తోంది. బాహుబలి లాంటి చిత్రం సృష్టిస్తున్న కలెక్షన్ల సునామీ ముందు చిన్న చిత్రాలు విడుదలైనా.. అంతగా రాణించలేకపోవడం.. బాహుబలే వాటి కలెక్షన్లను కూడా ఖాతాలో వేసుకుంది. ఈ తరుణంలో వచ్చిన కేశవ.. మాత్రం బాహుబలిని తట్టుకుని నిలబడే చిత్రంగా నిలుస్తుందన్న టాక్ రావడం కలిసోచ్చే అంశమే.
(And get your daily news straight to your inbox)
Apr 03 | కలర్ ఫోటో చిత్రంతో తన లోని దర్శకత్వ కోణాన్ని ప్రేక్షకులు ముందు ప్రవేశపెట్టి మంచి మార్కులు సాధించిన దర్శకుడు సందీప్ రాజ్. ఒక్క షార్ట్ ఫిల్మ్ తీసేసి.. సినిమా ఛాన్స్ పట్టేస్తున్నారు. నిజంగా ఇది... Read more
Apr 03 | అక్కినేని నాగచైతన్య.. మరోమారు టాలీవుడ్ అందాల బామ రాశీ ఖన్నాతో జతకడుతున్నాడు. మజలీ చిత్రంలో క్రికెటర్ అవతారమెత్తిన నాగచైతన్య.. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'థాంక్యూ' చిత్రంతో హాకీ ప్లేయర్గా కనిపిస్తాడు. అలాగే ఇందులో... Read more
Apr 03 | టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - విభిన్న కథాంశాలతో ప్రయోగాత్మక చిత్రాలను రూపోందించే ప్రముఖ దర్శకుడు సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో... Read more
Apr 02 | అభిమానుల దృష్టిలో పవన్ కల్యాణ్ .. ఒక పేరు కాదు పవర్ఫుల్ మంత్రం. తెరపై ఆయనను చూస్తే చాలు వాళ్లు పూనకాలు వచ్చినట్టుగా ఊగిపోతారు. పవన్ కల్యాణ్ నుంచి సినిమా వస్తుందంటే .. పండగ... Read more
Apr 02 | యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జంటగా నటిస్తున్న మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కూడా కీలకపాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ... Read more