Keshava Director Confessed Copy Remarks

Sudheer varma on kesava story line

Sudheer Varma, Director Sudheer Varma, Sudheer Varma Dochey Flop, Sudheer Varma Interview, Keshava Director Interview, Sudheer Varma Copy Marks, Sudheer Varma Hollywood Inspiration, Sudheer Varma Keshava Story Line, Sudheer Varma Comments, Nikhil Sudheer Varma

Keshava Director Sudheer Varma Exclusive Interview. Says he was inspired many scenes from other languages.

కేశవ కాపీ సినిమానే; సుధీర్ వర్మ

Posted: 05/17/2017 11:02 AM IST
Sudheer varma on kesava story line

ఇంగ్లీష్ తరహా టేకింగ్ తో సినిమాలు తెరకెక్కించే దర్శకులు ఇప్పుడిప్పుడే తెలుగులోనూ పుట్టుకొచ్చేస్తున్నారు. స్టైల్లోనే కాదు సినిమాలో ఫ్రేమ్ కు తగ్గట్లే కెమెరా పనితనంను వాడుకునే వాళ్లు మాత్రం చాలా అరుదు. యంగ్ డైరక్టర్ సుధీర్ వర్మ ఆ కోవకు చెందిన వాడే. స్వామిరారా అంటూ ఢిపరెంట్ కాన్సెప్ట్ తో ఆకట్టుకున్న ఇతగాడు దోచెయ్ తో మాత్రం దారుణంగా ఫేలయ్యాడు. ఇక ఇప్పుడు కేశవ అంటూ నిఖిల్ తోనే మళ్లీ ప్రయోగం చేయబోతున్నాడు. అయితే తన దృష్టిలో సినిమా అంటే కథ కన్నా దర్శకుడే మెయిన్ అని చెబుతున్నాడు సుదీర్.

దోచెయ్ సినిమా ఫ్లాప్ తనని ఎంతో బాధించిందన్న సుధీర్ ఆ సినిమా కథ అంత చెత్తది అయితే కాదన్నది తన ఉద్దేశ్యం అని తెలిపాడు. ప్రేమమ్ ఆడియో వేడుకలో కూడా స్టేజీ మీద చైతూ ఫ్యాన్స్ కు ఈ విషయంలో సారీ కూడా చెప్పాడు. మరీ అంత గొప్ప సినిమా ఏం కాకపోయినా పూర్ మార్కెటింగ్, రిలీజ్ సమయంలో పోటీగా పెద్ద సినిమాలు దోచెయ్ ను దెబ్బ తీశాయంటున్నాడు. తర్వాత రవితేజతో ఓ సినిమా ఛాన్స్ వచ్చినట్లే వచ్చి మిస్సయినా విషయాన్ని కూడా గుర్తు చేసుకున్నాడు. అయితేనేం కమెడియన్ సత్య కజిన్ హెల్త్ సమస్య(గుండె కుడి భాగంలో ఉండటం) విన్న తనకి కేశవ స్టోరీ లైన్ తట్టిందని చెప్పుకొచ్చాడు.

తన గత చిత్రాలు రెండూ క్రైమ్ కాన్సెప్ట్ లేనన్న సుధీర్ కేశవ కూడా అదే జోనర్ అయినప్పటికీ సాలిడ్ రివెంజ్ డ్రామాగా తీర్చిదిద్దానని కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు. ఫ్యామిలీ చిత్రాలను చూసి ఎంజాయ్ చేయటం తప్పించి అలాంటి ప్రయోగాల జోలికి మాత్రం అస్సలు పోనని తెలిపాడు. ఇక హాలీవుడ్ సీన్లను కాపీ చేస్తాడన్న విమర్శలపై స్పందిస్తూ.. ఇన్సిపిరేషన్, కాపీ ఈ రెండు తన ఉద్దేశ్యంలో ఒకటేనన్న వర్మ కేశవ కూడా అలా చాలా సినిమాల నుంచి ప్రేరణతోనే తీశానని క్లారిటీ ఇచ్చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Keshava Movie  Sudheer Varma  Nikhil  

Other Articles