Baahubali 2 Fastest 100 Crores Grosser in Kollywood

Enthiran records break by baahubali 2

Baahubali The Conclusion, Kollywood Fastest Century Movie, Robo Baahubali 2, Baahubali 2 Enthiran, Entiran Baahubali 2, Prabhas Beat Rajinikanth, Baahubali 18 Days Collections

Baahubali the Conclusion breaks Enthiran Records in Kollywood and emerge fastest 100 Crores Grosser. Bollywood Star Akshay Kumar and Ranveer Singh Praise Baahubali 2.

బాహుబలి-2 .. రజనీ రికార్డు బద్ధలు

Posted: 05/16/2017 05:45 PM IST
Enthiran records break by baahubali 2

‘బాహుబలి: ది కంక్లూజన్’ భారతీయ చలన చిత్ర సీమలో ఓ కొత్త అనుభవాన్ని అందిస్తోంది. మాములుగా ఓ ప్రాంతీయ చిత్రం పర భాషలోకి తర్జుమా అయిన టైంలో కలెక్షన్లు సాదాసీదాగా లేదంటే హిట్ టాక్ తో ఓ మాదిరి ఎక్కువగా సాధించటం చూస్తుంటాం. కానీ, భాష, ప్రాంతం భేధం లేకుండా రిలీజైన నాలుగు బాషల్లోనూ అత్యధిక కలెక్షన్లు సాధించే చిత్రంగా రికార్డు దిశగా పరుగులు తీస్తోంది.(బాలీవుడ్ లో 450 కోట్లు, టాలీవుడ్ లో 180 కోెట్లు, మళయాళంలో 70 కోట్లు) 

ముఖ్యంగా తామే తోపని ఫీలయ్యే కోలీవుడ్ లో ‘బాహుబలి-2’ సాధించిన వసూళ్లు చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది. ఇప్పటికే వంద కోట్ల కలెక్షన్లు సాధించి శంకర్-రజినీ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘రోబో’ కలెక్షన్లను ‘బాహుబలి-2’ దాటేస్తుండటం విశేషం. అంతేకాదు అత్యంత వేగంగా తమిళనాట 100 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ సాధించిన సినిమాగా ‘రోబో’ పేరిట ఉన్న రికార్డును ‘బాహుబలి-2’ బద్దలు కొట్టేసింది.

16 రోజుల్లోనే రాజమౌళి సినిమా ఈ ఘనతను అందుకుంది. షేర్ పరంగా రోబో, తేరిలు మాత్రం ఆ లిస్ట్ లో ముందున్నాయి. అయితే అవి రెండు పన్ను మినహాయింపు ఉన్న సినిమాలు, బాహుబలికి ఆ అవకాశం లేకుండా పోయింది. అయినప్పటికీ ఇప్పటికీ కోలీవుడ్ లో క్రౌడ్ పుల్ తో రన్ అవుతుండటం, ఇప్పట్లో స్టార్ల సినిమాలేవీ లేకపోవటంతో 150 కోట్లు సాధించటం పెద్ద సమస్యేం కాదని అంచనా వేస్తున్నారు.

బాలీవుడ్ లోనూ కితాబు...

బాలీవుడ్ లో బాహుబలి ది కంక్లూజన్ సక్సెస్ ను చాలా మంది ఓర్వలేకపోతున్నారని ముందే చెప్పుకున్నాం. నిర్మాత కరణ్ జోహర్ కి దాదాపు 400 శాతం లాభాలను అందించింది కూడా. ముఖ్యంగా ఖాన్ త్రయం అయితే ఈ విషయంలో అస్సలు నోరు మెదపలేకపోయారు. కానీ, షారూఖ్ మాత్రం కాస్త భిన్నంగా సెకండ్ పార్ట్ చూడలేదంటూనే బాహుబలి 2 ఇన్సిపిరేషన్ అంటూ వ్యాఖ్యానించటం విశేషం. ఇక యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ మాత్రం నిజాయితీగా రాజమౌళి చిత్రంపై ప్రశంసలు కురిపించాడు. మరోవైపు యంగ్ హీరో రణ్ వీర్ సింగ్ కు కూడా నచ్చిందంటూ తనదైన శైలిలో ఓ ట్వీట్ వేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali The Conclusion  Kollywood  100 Crores  

Other Articles