Vijayendra Prasad Penning sequels in Bollywood

Vijayendra prasad to work on rowdy rathore and nayak sequels

Baahubali Writer, Writer KV Vijayendra Prasad, Writer Vijayendra Prasad, Vijayendra Prasad Bollywood Sequels, Nayak and Rowdy Rathore Sequels, Shankar Sequel Bollywood, Vijayendra Prasad Bollywood Busy, Bollywood Busy Writer

Baahubali Writer KV Vijayendra Prasad Is Working On Sequels of Nayak, Rowdy Rathore. It's too early to share details about the story and the cast says Bajrangi Bhaijaan's Wtriter.

బాలీవుడ్ సీక్వెల్స్... బాహుబలి రచయిత కథలు

Posted: 05/16/2017 10:14 AM IST
Vijayendra prasad to work on rowdy rathore and nayak sequels

శంకర్ సినిమాల్లో ఒకే ఒక్కడు కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. పొలిటికల్ సెటైరిక్ గా తెరకెక్కిన ఈ చిత్రం తమిళ్ లోనే కాదు, తెలుగులోనూ వంద రోజులు విజయవంతంగా ఆడి విజయోత్సవ సభను జరుపుకుంది. అయితే హిందీలో మాత్రం నాయక్ గా వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. అయినప్పటికీ బాలీవుడ్ లో కొన్నాళ్లుగా ఈ సినిమాను రీమేక్ చేయాలని ఓ బాలీవుడ్ మేకర్ ఎప్పటి నుంచో యత్నిస్తున్నాడు.

ఇందులో భాగంగా సినిమాకు కథ అందించే పనిని రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ చేతిలో పెట్టాడు. రెగ్యులర్ కథలే అయినప్పటికీ తన పెన్నుతో పవర్ పుల్ స్టోరీ లైన్ ను ఇస్తున్న ఈ బాహుబలి రైటర్ కి ఇప్పుడు బాలీవుడ్ లో బాగా డిమాండ్ పెరిగిపోయింది. నాయక్ సీక్వెల్ మాత్రమే కాదు.. అప్పట్లో అక్షయ్ కుమార్ హీరోగా ఘన విజయం సాధించిన రౌడీ రాథోడ్ (తెలుగులో విక్రమార్కుడు) సీక్వెల్ కు కూడా కథ అందించే బాధ్యతను విజయేంద్ర ప్రసాద్ కే అప్పజెప్పారు.

ఇంకోవైపు ఆరంభ అనే సీరియల్ కు, క్రిష్-కంగనాల మణికర్ణికకు ఈ టాలీవుడ్ సీనియర్ రైటరే కథలు అందించటం విశేషం. సక్సెస్ విషయంలో తనయుడి కంటే కాస్త ఆలస్యంగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ అది గ్రాండ్ గా ఉండటం బహుశా ఈయన విషయంలోనే జరిగిందేమో.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali Writer  Vijayendra Prasad  Bollywood Remakes  

Other Articles