Katrina Kaif will not team up for Saaho

Katrina not in saaho movie

Prabhas, Prabhas katrina Kaif, Katrina Kaif Baahubali Hero, Saaho Katrina Kaif, Pooja Hegde Saaho, Prabhas Pooja Hegde, Pooja Hegde Prabhas Saaho, Saaho Heroine Finalized, Saaho Just Rumour, Saaho Fake News

Rumours about Katrina Kaif starring apposite Prabhas in his next titled Saaho have been doing the rounds for quite sometime now. But, Makers announced that she was not in.

సాహో లో కత్రినా.. జస్ట్ రూమర్

Posted: 05/16/2017 10:05 AM IST
Katrina not in saaho movie

బాహుబలితో నేషనల్ వైడ్ క్రేజ్ ను సంపాదించేసుకున్న ప్రభాస్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ నార్త్ లోనూ బాగా పెరిగిపోయింది. అందుకే తర్వాతి ప్రాజెక్టు సాహో విషయంలో కూడా ఎగ్జయిటింగ్ గా ఎదురుచూస్తున్నారు. మొన్నమధ్య రిలీజ్ చేసిన టీజర్ కు టాలీవుడ్ నుంచి అంతంత మాత్రమే స్పందన రాగా, బాలీవుడ్ మాత్రం ఫిదా అయిపోయింది.

సుమారు 150 కోట్ల బడ్జెట్ తో నిర్మించబడుతున్న సాహో లో ప్రభాస్ సరసన నటించే హీరోయిన్ ఎవరా? అన్నదాని గురించి నేషనల్ మీడియా కూడా ఆసక్తిగా గమనించటం మొదలుపెట్టింది. ఓ బాలీవుడ్ వెబ్ సైట్ ఆన్ లైన్ పోల్ నిర్వహించింది. ఇందులో కత్రినా కైఫ్ కు ఎక్కువ మంది ఓటేయగా, అలియా భట్ తర్వాతి ప్లేస్ లో నిలిచింది. అంతే దెబ్బకు కత్రినా కన్ఫర్మ్ అయినట్లు వాళ్లు వార్తలు రాసేశారు.

వాటి ఆధారంగా తెలుగు మీడియాలోనూ కత్రినా గురించే డిస్కషన్లు జరిగాయి. దీంతో రంగంలోకి దిగిన యూవీ క్రియేషన్స్ అదంతా రూమరేనని తేల్చేసింది. ఇప్పటిదాకా కత్రినాను కాదు కదా ఎవరినీ సంప్రదించలేదని ప్రకటించింది. అయితే ఈ రూమర్ కూడా ఒకందుకు ప్రభాస్ ను మళ్లీ నేషనల్ న్యూస్ లో నిలిపేందుకు కారణం అయినందుకు రెబల్ ఫ్యాన్స్ తెగ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఆ సంగతి ఏమోగానీ ఇప్పుడు మళ్లీ పూజా హెగ్డే పేరు కొత్తగా వినిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Saaho Movie  Katrina Kaif  Prabhas  Fake News  Pooja Hegde  

Other Articles