Jabardasth Actor Vinod Attempts Suicide

Jabardasth actor vinod suicide attempt

Jabardasth Famous Actor, Vinod aka Vinodini, Jabardasth Vinod Suicide Attempt, Vinod Attempts Suicide, Jabardasth Actor Vinod Love, Vinod Love Affair, Jabardasth Actor Suicide, Jabardasth Actor Suicide Attempt, Jabardasth Actor Death, Jabardasth Famous Vinodini, Jabardasth Actor Vinod, Jabardasth Actor Vinod Marriage, Jabardasth Actor Vinod, Jabardasth Vinod Fake News

Jabardasth Famous Actor Vinod aka Vinodini was seen in the police station for cancelling his marriage. He even tried to commit suicide after his mother Seromani managed a marriage for him forcefully.

జబర్దస్త్‌ వినోద్ సూసైడ్ అటెంప్ట్

Posted: 05/09/2017 08:04 AM IST
Jabardasth actor vinod suicide attempt

తెరపై వినోదంతో నవ్వులు పంచే నటీనటుల వ్యక్తి గత జీవితంలో మాత్రం రెగ్యులర్ కష్టాలు తప్పటం లేదు. ఓ ప్రముఖ ఛానెల్ లో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ద్వారా సుపరిచితుడైన నటుడు వినోద్ అలియాస్ వినోదిని ఆత్మహత్య యత్నం చేసుకున్నాడన్న వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

చమ్మక్ చంద్ర టీంతో పాటు మిగతా వాళ్ల స్కిట్ లలో కూడా లేడీ గెటప్ అలరిస్తున్నాడు నటుడు వినోద్. తన తల్లికి అనారోగ్యంగా ఉందన్న వార్త తెలియటంతో హుటాహుటినా కర్నూల్ లోని సంజామల మండలం స్వగ్రామమైన బొందలదిన్నె గ్రామానికి వెళ్లాడు. అయితే అక్కడికి వెళ్లిన వినోద్ కు షాక్ తగిలింది. తనకు ఇష్టం లేకుండా స్థానికంగా ఉండే ఓ అమ్మాయితో బలవంతపు పెళ్లి చేసేందుకు యత్నించింది.

దీంతో వినోద్ తన చేతిని గాయపర్చుకున్నాడు. వెంటనే సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆ పెళ్లిని ఆపేశారు. వినోద్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ప్రేమ వ్యవహారంతోనే వినోద్ ఇలా చేసుంటాడా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

అదంతా ఫేక్ న్యూస్... వినోద్

వినోద్ వారి నిర్ణయంతో విభేదించడంతో...బలవంతంగా అయినా వివాహం జరపాలని భావించారంట. ఈ క్రమంలో జరిగిన పెనుగులాటలో వినోద్ చేతికి గాయమైంది. అంతేకానీ ఆత్మహత్యాయత్నం చేయలేదు. ఇక కుటుంబ సభ్యులే అతనిని బలవంతం చేయడంతో కిడ్నాప్ కూడా జరగలేదు. ఇంతలో కిడ్నాప్ అంటూ పోలీసులకు సమాచారం అందడంతో వారు సంఘటనాస్థలికి చేరుకోగా...తననెవరూ కిడ్నాప్ చేయలేదని, ఆత్మహత్యాయత్నం కూడా చేయలేదని వినోద్ లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చాడు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jabardasth Actor  Vinod  Suicide Attempt  

Other Articles