Baahubali Hysteria Rules Indian Box Office

Baahubali 2 ruled box office collections

Baahubali 2 Collections, Baahubali 2 1000 Crores Club, Baahubali 2 Mania, Baahubali 2, Baahubali The Conclusion, Baahubali 2 10 Days Collections, Baahubali Hysteria, Baahubali 2 Box Office Collections, Baahubali 3, No Baahubali 3, Baahubali 3 Shelved, Baahubali 3 Rajamouli

Baahubali 2 Collections Continues after reaching 1000 Crore Club Mile Stone. Writer Vijayendra Prasad Clarified that there is no Baahubali 3.

అంతా బాహుబలి 2 మయమే...

Posted: 05/08/2017 04:24 PM IST
Baahubali 2 ruled box office collections

ఏప్రిల్ 28న సినిమా రిలీజ్ అయిన దగ్గరి నుంచి బాక్సాఫీస్ రికార్డులు బద్ధలు అవుతూనే ఉన్నాయి. కేవలం 9 రోజుల్లో వెయ్యి కోట్లు వసూలు చేసి సగర్వంగా ఓ తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ లెవల్లోకి తీసుకెళ్లేలా చేశాడు దర్శకధీరుడు రాజమౌళి. లోకల్ , నాన్ లోకల్ అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో కంక్లూజన్ కి బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు.

తెలుగు రాష్ట్రాల్లో 139 కోట్ల కలెక్షన్లతో 150 దిశగా పరుగులు పెడుతోంది. రెండో వారంలో కూడా ఆ ఎపిక్ రన్ అలాగే కంటిన్యూ అయ్యే ఛాన్సు ఉంది. మొత్తానికి ఇప్పటిదాకా ఇండియాలో 800 కోట్లు.. ఓవర్సీస్ లో 200 కోట్లు.. టోటల్ గా 1000 కోట్లు సాధించిన చిత్రం, లాంగ్ రన్ లో ఇండియాలోనే 1000 కోట్లు దాటేలా కనిపిస్తోంది.

ఇక బాలీవుడ్ లో 330 కోట్లు దాకా వసూలు చేసి ఊహించని రీతిలో లాభాలు అందించగా, కేవలం యూఎస్ లోనే 100 కోట్లు సాధించి డ్రీమ్ రన్ దిశగా పరుగులు పెడుతోంది. పోటీగా మిగతా భాషల్లో కూడా ఏ చిత్రాన్ని విడుదల చేసేందుకు సిద్ధంగా లేకపోవటంతో మరో రెండు వారాలపాటు బాహుబలి హవా కొనసాగేలా కనిపిస్తోంది.

బాహుబలి-3 ఉండదు: విజయేంద్ర ప్రసాద్

అప్పుడెప్పుడో రాజమౌళి చేసిన ట్వీట్లను పట్టుకుని మూడో భాగం కూడా వస్తుందేమోనని బాలీవుడ్ మీడియా, కొందరు సినీ అభిమానులు భావిస్తున్నారు. అయితే 'బాహుబలితో' తన పని పూర్తయిపోయిందని దర్శక దిగ్గజం రాజమౌళి ఇప్పటికే ప్రకటించాడు. ఇప్పుడు రాజమౌళి తండ్రి, ఈ సినిమా కథా రచయిత విజయేంద్రప్రసాద్ కూడా దీనిపై పూర్తి క్లారిటీ ఇచ్చారు.

"బాహుబలిని మేము ఇప్పటికే పూర్తి చేశాం. మూడవ భాగం ఉండదు. పైగా దర్శకుడితో దీనికి సంబంధించి ఎలాంటి డిస్కషన్ చేయలేదు. మూడో భాగానికి సంబంధించి నేను కూడా కథను రాయడం లేదు" అంటూ ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్ వెల్లడించాడు. అయితే బాహుబలి మూలం నుంచి కామిక్ సిరీస్, టీవీ సిరీస్ లు వస్తాయని తెలిపారు. అవే సెట్స్ మీద వీటి షూటింగ్ జరుగుతుందని... అందువల్ల బాహుబలికి ముగింపు ఉండబోదనే తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali 2  10 Days Collections  1000 Crores Club  

Other Articles