Rakul Preet Singh Work Dedication on Tollywood

Rakul effection on tollywood

Rakul Preet Singh, Rakul Preet Singh Tollywood, Rakul Preet Singh, Rakul Telugu Teacher, Rakul Work Dedication, Tollywood Actress Rakul, Rakul Better Speak Telugu, Rakul 6 Months

Rakul Preet Singh Efefction on Tollywood. She speaks telugu with in 6 months only.

రకుల్ డెడికేషన్ ఎంతలా అంటే...

Posted: 05/06/2017 05:07 PM IST
Rakul effection on tollywood

టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలో స్టార్ డమ్ ను సాధించటమే కాదు. దానిని ఎక్కువ కాలం కొనసాగించటం కూడా చాలా కష్టమే. ఒకప్పుడు దశాబ్దాలపాటు ఇండస్ట్రీలో రాణించిన వారు ఉంటే.. ఇప్పుడొచ్చే వాళ్లలో ఆ స్ట్రీమ్ ను కొనసాగించేవాళ్లు చాలా తక్కువగా కనిపిస్తున్నారు. ఒకవేళ కంటిన్యూ అయినా జస్ట్ గ్లామర్ తోనే నెట్టుకొచ్చే వాళ్లు ఉన్నారే తప్ప యాక్టింగ్ పరంగా మాత్రం అంత ఆకట్టుకోలేకపోతున్నారు.

కానీ, పంజాబీ బ్యూటీ రకుల్ మాత్రం అలా కాదు. మొదట్లో నటనపరంగా తడబడ్డప్పటికీ తర్వాత మెల్లిగా ఇంప్రూవ్ చేసుకుంటూ స్టార్ల సరసన చేసే స్థాయికి రీచ్ అయ్యింది. అంతేనా పెద్ద పెద్ద పంక్షన్ లలో తడబడకుండా తెలుగు చక్కగా మాట్లాడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తెలుగు సినీ పరిశ్రమ తనను ఆదరించిందని, మంచి విజయాలతో మంచి గుర్తింపును, స్టార్ హోదాను ఇచ్చిందని, ఇన్ని ఇచ్చిన తెలుగు సినీ పరిశ్రమకు ఏమివ్వగలనని ఆలోచించి, తెలుగు నేర్చుకోవడమే ఉత్తమమని నిర్ణయించుకుందంట.

 

సపోర్టింగ్ స్టాఫ్ తో పాటు, షూటింగ్ లో యూనిట్ సభ్యులతో తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేశా, కేవలం ఆరు నెలల్లో తెలుగు భాషపై పట్టు సంపాదించుకున్నాఅని చెబుతోంది. ఇండస్ట్రీపై ప్రేమతో భాషను నేర్చుకున్నప్పటికీ అది తనకు ఎంతో మేలు చేసిందని తెలిపింది. కథ, పాత్రలను బాగా అర్థం చేసుకుని, మరింత బాగా నటించేందుకు బాష ఉపయోగపడుతుందని చెబుతోంది. వర్క్ డెడికేషన్ అలా ఉంది కాబట్టే రకుల్ కు సౌత్ లో అన్ని భాషల్లో ఆఫర్లు క్యూ కడుతున్నాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tollywood  Rakul Preet Singh  Telugu Speaking  

Other Articles

Today on Telugu Wishesh