Telugu version of bairavaa ready for release

Vijay bairavaa telugu dubbing release soon

Vijay Bairavaa, Bairavaa Telugu Dub Movie, Vijay Telugu Dub Movies, Vijay Bairavaa Telugu Title, Vijaya Bairava Telugu Movie, Vijaya bairavaa 2017 Movie, Vijaya Bairava Movie, Vijay Keerthy Suresh Telugu Movie, Vijay Bairavaa Telugu Movie, Kollywood Flop Movie Telugu Dub, Vijaya Bairava Release Date

Vijay's Bairavaa dubbed into Telugu as Vijaya Bairava and getting ready to release.

విజయ్ ఫ్లాప్ భైరవ తెలుగులో డబ్

Posted: 05/02/2017 01:12 PM IST
Vijay bairavaa telugu dubbing release soon

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కి అక్కడున్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రజనీ తర్వాత.. కమల్ కంటే ఎక్కువగా కలెక్షన్లు రాబట్టే హీరోగా మాస్ లో మాంచి ఫాలోయింగ్ ఉంది. అయితే తమిళ్ లో తర్వాత వచ్చిన హీరోలంతా తెలుగులో దూసుకుపోతుంటే విజయ్ మాత్రం ఇక్కడ ఎస్టాబ్లిష్ కావటంలో ఎప్పటికప్పుడు విఫలమవుతూనే ఉంటాడు.

ఒక్క తుపాకీ తప్ప తెలుగులో విజయ్ రిలీజ్ చేసిన ఏ సినిమా కూడా అంతగా ఆడలేకపోయింది. ఈ యేడాది సంక్రాంతికి భైరవ తో పలకరించిన విజయ్ కలెక్షన్ల పరంగా కుమ్మేసినప్పటికీ, కథ పరంగా మాత్రం క్రిటిక్స్ కడిగిపడేశారు. ఊర మాస్ కథతో అంతగా ఆకట్టుకోలేకపోయాడని విమర్శలు పడ్డాయి. అలాంటి సినిమాను ఇప్పుడు తెలుగులో రిలీజ్ చేసేందుకు సిద్ధమైపోయారు.

తెలుగులో క్రేజీ బ్యూటీగా ఉన్న కీర్తి సురేష్ అందులో హీరోయిన్, జగపతి బాబు విలన్. అందుకే ఆ సినిమాను ఇప్పుడు తెలుగులో విజయ భైరవ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. హిట్ సినిమాకే ఇక్కడ ఆదరణ లేని క్రమంలో అసలే నెగటివ్ టాక్ తెచ్చుకున్న సినిమా రిలీజ్ చేయటం విడ్డూరమే. చూద్దాం అసలే వరుస సినిమాలతో బిజీగా మారబోతున్న మే నెలలో భైరవ రిలీజ్ కావటం  మరో ప్రతికూల అంశం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijay  Bairavaa Movie  Telugu Dub  Vijaya Bairava Movie  

Other Articles