Baahubali The Conclusion 4 Days Collections

Baahubali 2 four days collections

Baahubali-2, Baahubali-2 4 Days Collections, Baahubali The Conclusion Collections, Baahubali 2 600 Crores, Baahubali 2 Hindi Collections, Baahubali The Conclusion, Baahubali 2 Bollywood Collections

Baahubali The Conclusion World Wide Collections. Rajamouli Directorial venture crossed 600 Crore within 4 Days.

బాహుబలి-2 నాలుగు రోజుల కలెక్షన్లు

Posted: 05/02/2017 03:38 PM IST
Baahubali 2 four days collections

వెయ్యి కోట్ల కలెక్షన్ల కలను ఈ వారంలోనే బాహుబలి ది కంక్లూజన్ అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాలుగు రోజులు కేవలం నాలుగంటే నాలుగు రోజుల్లోనే 600 కోట్లు వసూలు చేసి ఇండియన్ భాక్సాపీస్ ను షేక్ చేసి పడేసింది.

దంగల్, పీకే రికార్డుల లైఫ్ టైం కలెక్షన్లకు కొద్ది దూరంలోనే ఉన్న బాహుబలి ఆల్ టైం రికార్డ్స్ ను నెలకొల్పటం చాలా చాలా ఈజీ. టికెట్లు రేట్ పెంపు లేకపోయినా ఎక్కువ స్క్రీన్లు, షోల మూలంగా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 90 కోట్లు వసూలు చేసి ఇక డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు అందించే పనిలో పడింది. బాలీవుడ్ (హిందీవర్షన్) లోనే 150 కోట్లు సాధించటం విశేషం.

ఇక బాహుబలి-2 దెబ్బకు ఒకేసారి ఏడు రికార్డులు బద్ధలు అయ్యాయి. ఇందులో ఎక్కువగా దంగల్ నే టార్గెట్ చేయటం విశేషం. హయ్యెస్ట్ అడ్వాన్స్ బుకింగ్ తో 36 కోట్లు సంపాదించిన చిత్రంగా కొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇది ఇంతకు ముందు 18 కోట్లతో దంగల్ పేరిట ఉంది. ఇక అమెరికాలో 800 స్క్రీన్లతో బాహుబలి 2 రిలీజ్ అవ్వగా, దంగల్ 331 స్క్రీన్లు రిలీజ్ అయ్యింది.

లార్జెస్ట్ స్క్రీన్ కౌంట్ ఇండియాలో నే 8000 స్క్రీన్లలో రిలీజ్ అయ్యి ఆల్ టైం రికార్డును సాధించింది. ఇది ఇంతకు ముందు సల్మాన్ ఖాన్ సుల్తాన్ (4350) స్క్రీన్లలో రిలీజ్ అయ్యింది. 2017 లో హ్యయెస్ట్ ఓపెనింగ్ డే రికార్డు 95 శాతం థియేటర్లో రిలీజ్ కాగా, రయిస్ 70 శాతం థియేటర్లలో ఆక్యుపెన్సీ సాధించింది. భారీ ఓపెనింగ్స్ తో 121 కోట్లు ఫస్ట్ డే సాధించి మరో రికార్డు నెలకొల్పింది. కేవలం హిందీ వర్షన్ 41 కోట్లతో బాలీవుడ్ సినిమాలను బీట్ చేసింది. వీటన్నింటి కంటే 12 సెకన్లకొకసారి బుక్ మై షోలో టికెట్ అమ్ముడు పోవటం ద్వారా మరో రికార్డు ఇలా మొత్తం ఏడు రికార్డులను ఒకే సారి బద్ధలు కొట్టింది ఇండియన్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్.


నాలుగు రోజు కలెక్షన్ల వివరాలు

Nizam - 24,10,00,000

Ceded - 15,60,00,000

Nellore - 3,67,00,000

Guntur - 10,01,00,000

Krishna - 6,40,43,652

West - 8,20,52,454

East - 9,96,00,000

Uttharandhra - 11,36,00,000

Total 4 Days AP & TG Share - 89.31cr approx.

 

Prabhas Wax Statue

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali The Conclusion  4 Days Collections  600 Crores  

Other Articles