Baahubali 2 interval episode inspired by Pawan Kalyan ‘‘బాహుబలి విరామానికి స్ఫూర్తినిచ్చింది పవన్ కల్యానే’’

Baahubali 2 interval episode inspired by pawan kalyan

Baahubali 2, baahubali interval episode, baahubali inspired by Pawan kalyan, baahubali pawan kalyan enviable fan following baahubali, interval episode, Pawan Kalyan, fan following, inspiration, tollywood

Interestingly Pawan’s cult fan following has inspired Baahubali script writer Vijayendra Prasad to weave the engrossing interval episode in Baahubali 2.

‘‘బాహుబలి 2 విరామానికి స్ఫూర్తినిచ్చింది పవన్ కల్యానే’’

Posted: 05/01/2017 07:22 AM IST
Baahubali 2 interval episode inspired by pawan kalyan

ప్రపంచం నలుదిశలా తన సత్తాను చాటి తెలుగోడి గొప్పదనాన్ని మరోమారు విశ్వవ్యాప్తం చేసిన చిత్రం బాహుబలి. దేశంలో ఓ ప్రాంతానికి మాత్రమే పరిమితం కాకుండా ఏకంగా ప్రపంచ స్థాయి చిత్రాలతో పోటీపడేలా వుందన్న ప్రశంసలు తెలుగు సినీ అభిమాని కాలర్ ఎగురేసుకునేలా చేస్తున్నాయి. ఈ మొత్తం క్రెడిట్ దర్శకుడు రాజమౌళీదే అయినా.. అందులో బలమైన కథను జోడించి ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా భాగముందన్నది కాదనలేని సత్యం.

ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ప్రతీ దేశంలో బాక్సాఫీసు కలెక్షన్లను షేక్ చేస్తూ.. వసూళ్ల సునామీ సృష్టిస్తున్న "బాహుబలి ది కన్ క్లూజన్" చిత్రంలో ఓ సన్నివేశంలో పవర్ స్టార్ పవన్ కల్యాన్ స్ఫూర్తి కలిగించారంటే అయన అభిమానులకు నిజంగా పండగే. అయితే ఇది ముమ్మాటికీ నిజం. బాహుబలి 2 చిత్రంలో విరామ సమయానికి ఇవ్వాల్సిన ట్విస్ట్ తాను ఎంతగా అలోచించినా రాలేదని, అయితే అప్పుడు కొంచెం రిలీఫ్ కోసం టీవీ చూస్తుండగా వచ్చిన ఓ యదార్థ పవన్ అభిమానులనే స్ఫూర్తిగా తీసుకుని తాను చిత్రంలో ఇంటర్వెల్ ట్విస్టును రాసానని విజయేంద్ర ప్రసాద్ అన్నారు.

భల్లాల దేవుడికి పట్టాభిషేకం జరిగినా, అతను తృప్తిగా ఉండలేడని, బాహుబలికే ప్రజామద్దతు ఉందని, అతనికే ప్రజలు నీరాజనాలు పలుకుతుంటారని, ఓ కాన్సెప్ట్ ను సిద్దం చేసుకున్నామని, అయితే దానిని తెరపైకి ఎలా ఎక్కించాలా అని అలోచించి.. రిలీఫ్ కోసం టీవీ పెడితే, ఓ ఆడియో ఫంక్షన్ వస్తోందని గుర్తు చేసుకున్నారు. ఆ అడియో లాంచ్ వేడుకలోని సన్నివేశాలన్ని తనకు తన సన్నివేశం తెరకెక్కించుందుకు దోహదపడ్డాయని అయన చెప్పారు.

తాను టీవీలో చూస్తున్న అడియో లాంచ్ వేడుకలో పవన్ కల్యాన్ లేడని, కానీ పవన్ పేరు వినిపించినప్పుడల్లా, అభిమానులు వెర్రిగా ఊగిపోతూ, ఆపై ఐదు నిమిషాల పాటు ఎవరు ఏమి మాట్లాడినా వినిపించలేదని చెప్పారు. అయితే అక్కడే వేదికపై ఉన్న హీరోలంతా అసూయపడకపోయినా.. అలాంటి పరిస్థితిని తాను తన చిత్రంలో జోడించాలని భావించానని, ఇలానే భల్లాల దేవుడికి రాజ్యపీఠాన్ని అప్పగిస్తున్న క్రమంలో బాహుబలికి రాజ్యాన్ని అప్పగించాలని ప్రజలు పరితమించేలా.. చకచకా విశ్రాంతి సన్నివేశాన్ని రాసుకున్నానని ఆ విధంగా ఇంటర్వెల్ సీన్ కు పవన్ కల్యాణ్ స్ఫూర్తి అని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali 2  interval episode  Pawan Kalyan  fan following  inspiration  tollywood  

Other Articles