Baahubali 2 insult by National Media

National media really insult baahubali 2

National Media Insult Baahubali 2, Baahubali 2 National Media, National Media Baahubali 2, Baahubali 2 Debate, Baahubali 2 Insult, Baahubali 2 Tamil Movie, Baahubali 2 Actual Language, Baahubali 2 Tamil or Telugu, Bollywood Media Baahubali 2, Bollywood Jealous Baahubali 2

National Media Debate on 'Baahubali: The Conclusion' on a National Channel is really disheartening to watch. Even 'Telugu' was presented as 'Telugu' in the sub-text. Is this the kind of respect Telugus deserve? How could a National Media House be so irresponsible.

బాహుబలి-2 కి నేషనల్ మీడియా అవమానం

Posted: 04/29/2017 04:29 PM IST
National media really insult baahubali 2

చూస్తుంటే నిజంగానే బాహుబలి బిఫోర్.. ఆఫ్టర్ అన్న చందాన తయారయ్యింది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ పరిస్థితి. ప్రామాణికంగా చెప్పుకునే బాలీవుడ్ లోని స్టార్ హీరోల చిత్రాల రికార్డుల సైతం చెరిపేస్తూ కొత్త రికార్డుల దిశగా పరుగులు పెడుతోంది. ఇది సహజంగానే బాలీవుడ్ వర్గాల్లో ఆందోళన.. అంతకు మించి అసూయను పెంచుతున్నాయనటంలో ఎలాంటి సందేహం లేదు. కనీసం వేరే దర్శకులు ఊహించడానికి కూడా భయపడే స్థాయిలో కొన్ని సన్నివేశాల్ని రాజమౌళి తీర్చిదిద్దాడనటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

అయితే రిలీజ్ కు ముందు హైప్ మాత్రమే అందుకుంటుందనుకున్న హిందీ వర్గాలు ఆ అంచనాలు ఆకాశానికి చేరటంతో కలవరపాటుకు గురవుతున్నాయి. అందుకే కట్టప్ప సీక్రెట్ పెద్ద గొప్పగా ఏం లేదన్న పాయింట్ ను పట్టుకుని దారుణమైన రివ్యూలు ఇచ్చేశాయ్ కొన్నిసైట్లు. కానీ, థియేటర్ల దగ్గర పరిస్థితి, కలెక్షన్లు మాత్రం క్రేజ్ ను చాటుతున్నాయి కదా అందుకే ఇప్పుడు పాజిటివ్ కథనాలతో ఎగబడిపోతున్నాయి.

ఇందులో చూపించటానికి మైనస్ పాయింట్లు ఉన్నప్పటికీ పూర్తి నెగెటివ్ గా మాట్లాడటానికి ఎలాంటి స్కోప్ లేకుండా పోయింది. అందుకే భాష భేదాలను ప్రదర్శిస్తోంది. అందుకే మాతృక తెలుగు అయినప్పటికీ ఓ తమిళ్ సినిమా అంటూ కథనాలు ప్రసారం చేస్తోంది. ఓ జాతీయ మీడియా ఇది ఓ కోలీవుడ్ డబ్బింగ్ సినిమా అంటూ చేసిన కవరేజ్ పై సోషల్ మీడియాలో ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. సాధారణంగా కన్నడలోకి డబ్బింగ్ సినిమాలు నిషేధం. బాహుబలి 2 కూడా స్ట్రెయిట్ గానే రిలీజ్ అయ్యింది. అయినప్పటికీ వాళ్లు వేసిన హెడ్డింగ్ పైగా తెలుగు విషయంలో స్పెల్లింగ్ మిస్టేక్.. ఇలా ఉంది నేషనల్ మీడియా నిర్లక్ష్యపు ధోరణి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali 2 Insult  National Media  Wrong Story  

Other Articles