Akshay Kumar says Take back his National Award | పాతికేళ్లుగా చూస్తున్నా.. అవార్డులు వాళ్లకెలా వచ్చాయి మరి?

Akshay kumar on best actor controversy

Akshay Kumar, National Best Actor Award 2016, Akshay Kumar Best Actor Controversy, Akshay Kumar Priyadarshan, National Award Priyadarshan, Akshay Kumar National Award back, Akshay Kumar Controversy, Akshay Kumar Response National Award

Akshay Kumar On Best Actor Controversy. Strongly reacted on Critics. Take back may Award he is ready to give it back to jury."As for Priyan favouring me, I think he has answered that question," Akshay told media - Priyadarshan has defended the decision to award Akshay Kumar by comparing it to Amitabh Bachchan's performance in Piku being picked for Best Actor last year by a jury headed by Mr Bachchan's Sholay director Ramesh Sippy.

నేషనల్ అవార్డు కాంట్రవర్సీపై అక్షయ్ కుమార్ రియాక్షన్

Posted: 04/25/2017 08:55 AM IST
Akshay kumar on best actor controversy

జాతీయ అవార్డుల వివాదాలు కొత్తేం కాదు. ప్రతీ యేటా అవార్డులను ప్రకటించడం. అరరె.. వారికెలా ఇస్తారు? వీళ్లకు కదా ఇవ్వాల్సింది. కేవలం పక్షపాల ధోరణితోనే ఇచ్చేశారు... ఇలా రకరకాల కామెంట్లు వచ్చి పడుతుంటాయి. ఈ యేడాది కూడా అదే సీన్ రిపీట్ అయ్యింది. రుస్తుం సినిమాకు గానూ యాక్షన్ స్టార్ అక్షయ్ కుమార్ కు అవార్డును ప్రకటించింది జ్యూరీ.

అయితే ప్రియదర్శన్ కు ఫేవరెట్ పర్సన్ కావటంతోనే అవార్డు ఇచ్చారని మురగదాస్ లాంటి స్టార్ దర్శకుడు కూడా కామెంట్ చేశాడు. ఆపై దంగల్ కు గానూ అమీర్ కు, అలీగఢ్ కు గానూ మనోజ్ బాజ్ పాయికు ఎందుకు ఇవ్వలేదంటూ మరికొందరు ప్రశ్నించారు. ఇలా ఈ వివాదం కొనసాగుతున్న సమయంలో అక్షయ్ కుమార్ తన అవార్డుపై వస్తున్న విమర్శలకు స్పందించాడు. అవసరమైతే నా అవార్డును వెనక్కి తీసుకొండని వ్యాఖ్యానించాడు.

పాతికేళ్ల నుంచి ఇదే వింటున్నా. ఇదేం కొత్త కాదు. ఎవరో ఒకరు ఇలా వివాదాలను రాజేస్తు వస్తున్నారు. వాళ్ల సమస్య ఏంటో నాకు అర్థం కావట్లేదు. నా కెరీర్ లోనే ఫస్ట్ టైం బెస్ట్ యాక్టర్ అవార్డు ప్రకటించారు. వాళ్లకు నచ్చకపోతే నా అవార్డును వెనక్కి ఇచ్చేందుకు ఏం అభ్యంతరం లేదు అని ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

రమేష్ సిప్పీ జ్యూరీ హెడ్ గా ఉన్నప్పుడు అమితాబ్ బచ్చన్ కు, ప్రకాశ్ ఝా ఉన్నప్పుడు అజయ్ దేవగన్ కు ఇచ్చారు. ఆ సమయంలో లేని వివాదాలు ఇప్పుడు నేను ఉన్నప్పుడే ఎందుకు వస్తున్నాయంటూ ప్రియదర్శన్ కామెంట్ చేసిన విషయం తెలిసిందే. ప్రాంతీయ సినిమాలు అద్భుతంగా ఉండటం వల్లే దంగల్ చిత్రానికి అవార్డులు పెద్దగా రాలేకపోయాయన్న వాదనను ఆయన వినిపించాడు కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akshay Kumar  National Award 2016  Best Actor Controversy  

Other Articles