Zaheer Khan and actress Sagarika Ghatge engaged | జహీర్ కాబోయే భార్య ఎవరో తెలుసా?.

Zaheer khan announces engagement with sagarika ghatge

Sagarika Ghatge, Sagarika Ghatge Zaheer Khan, Zaheer Khan Sagarika Engagement, Bollywood Actress Cricketer Engagement, Zaheer Khan Sagarika Ghatge, Sagarika Ghatge Husband, Zaheer Khan Wife, Zaheer Khan Engagement Photos, Actress Sagarika Ghatge, Zaheer Khan Sagarika Unknown Details

Cricketer Zaheer Khan Gets Engaged To Actress Sagarika Ghatge, Breaks The News With A Touch Of Wit. Fellow cricketers and Bollywood celebs wish the couple a great life.

బాలీవుడ్ నటితో జహీర్ ఖాన్ ఎంగేజ్ మెంట్

Posted: 04/25/2017 11:19 AM IST
Zaheer khan announces engagement with sagarika ghatge

టీమిండియా మాజీ క్రికెటర్, ఢిల్లీ డేర్ డెవిల్స్ కెప్టెన్ జహీర్ ఖాన్ ఎట్టకేలకు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. 38 ఏళ్ల జహీర్ బాలీవుడ్ నటి సాగరిక ఘటెతో ఎంగేజ్ మెంట్ చేసేసుకున్నాడు. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతుండగా, ఇప్పుడు పెళ్లి వైపు అడుగు పడింది.

సాగరికతో తనకు నిశ్చితార్థమైనట్టు ఈ సీనియర్ ఫాస్ట్ బౌలర్ తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ‘‘మీ భార్య ఎంపికలను చూసి నవ్వుకోకండి. ఎందుకంటే మీరు కూడా అందులో భాగమేనన్న సంగతి గుర్తుపెట్టుకోండి’’ అంటూ సాగరికతో ఉన్న ఫొటోతో ట్వీట్ చేసిన జహీర్ ‘నిశ్చితార్థం ముగిసింది’ అన్న హ్యాష్‌టాగ్ తగిలించాడు. జహీర్ పోస్ట్ చేసిన ఫొటోలో సాగరిక వేలికి ఉన్న నిశ్చితార్థ ఉంగరం స్పష్టంగా కనబడుతోంది.

చక్ దే ఇండియాతో గుర్తింపు పొందిన 31 ఏళ్ల సాగరిక తర్వాత మరో అరడజను చిత్రాల్లో నటించిన పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ మధ్య యూవీ పెళ్లి సందర్భంగా వీరిద్దరు జంటగా కనిపించి సందడి చేయటంతో డేటింగ్ చేస్తున్నారన్న వార్తలు గుప్పుమన్నాయి. మొత్తానికి ఎట్టలకేలకు తన బ్యాచిలర్ లైఫ్ కు ముగింపు పలికబోతున్న ఈ స్టార్ బౌలర్ కు సహచరులతోపాటు అంతా కంగ్రాట్స్ తెలియజేస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు సభ్యులు వేరే సాగరిక పేరును ప్రస్తావించటం కొసమెరుపు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Zaheer Khan  Sagarika Ghatge  Engagement  

Other Articles